“నాకిదే బిగ్గెస్ట్ ఆఫర్” అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ.. ‘హరిహర విరమల్లు’ సినిమాపై నిధి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Nidhi Agarwal: నిధి అగర్వాల్.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు ఇంపోర్ట్ అయిన ఈ బ్యూటీ.. నాగచైతన్య సవ్యసాచి ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయం అయ్యింది.

నాకిదే బిగ్గెస్ట్ ఆఫర్ అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ.. హరిహర విరమల్లు సినిమాపై నిధి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Nidhhi Agerwal

Updated on: Jun 04, 2021 | 3:17 PM

Nidhi Agarwal: నిధి అగర్వాల్.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు ఇంపోర్ట్ అయిన ఈ బ్యూటీ.. నాగచైతన్య సవ్యసాచి ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ సరసన మిస్టర్ మజ్నూలో నటించిన నిధి.. ఆ వెంటనే ప్రస్తుతం ఓ మెగా ఆఫర్ అందుకుంది. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జీటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ.. నిధికి మంచిపేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో.. నిధికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

ఇదిలా ఉంటే.. నిధి ప్రస్తుతం పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న హరి హర వీరమల్లు మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఇన్నాళ్లూ పవన్ కు జోడీగా నిధికి అవకాశం వచ్చినట్లు రూమర్స్ వినిపించినా.. చివరకు తాజాగా ఈ ముద్దుగుమ్మనే ఓపెన్ అయ్యింది. తన కెరీర్ లో ఇదో గొప్ప అచీవ్ మెంట్ అని చెప్పుకొచ్చింది. తన సినీ లైఫ్ లో.. ఇదో గొప్ప అవకాశం అని.. పవన్ కళ్యాణ్ తో షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు వెయిట్ చేస్తున్నట్టుగా.. తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకిదే బిగ్గెస్ట్ ఆఫర్ అని సంతోషం వ్యక్తం చేసింది. ఈ మూవీ సక్సెస్ తో.. తన కెరీర్ పరుగులు పెడుతుందని ఆశపడుతోంది. మరోవైపు హరి హర వీరమల్లు మూవీ.. ఇప్పటికే 50 శాతం పూర్తైందని.. మేకర్స్ ఇంతకుముందే ప్రకటించారు. ఈ కరోనా పరిస్థితులు అనుకూలించాక.. షూటింగ్ ను మొదలుపెడతామని.. తెలిపారు మేకర్స్. అన్నీ కుదిరితే.. ఈ సంక్రాంతికి హరి హర వీరమల్లు మూవీ థియేటర్లలో సందడి చేయనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Son Of India: “నేను చీకటిలో ఉండే వెలుతురిని.. వెలుతురులో ఉండే చీకటిని.. మోహన్ బాబు డైలాగ్స్‏ .. వెరీ ఇంట్రెస్టింగ్ అంటున్న చిరు

Akhil Movie: అఖిల్ సినిమాలో మరో సూపర్ స్టార్.. కీలక పాత్ర కోసం కన్నడ హీరో ఉపేంద్ర ?..