Vijay – Shiva Nirvana: ప్యాన్‌ ఇండియా సినిమాలకే మొగ్గు చూపుతోన్న రౌడీ హీరో.. శివ మూవీ కూడా అలానే ఉంటుందా.?

|

Aug 20, 2021 | 8:32 PM

Vijay - Shiva Nirvana: అర్జున్‌ రెడ్డితో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో పెను సంచలనంగా దూసుకొచ్చాడు విజయ్‌ దేవరకొండ. అనతి కాలంలోనే అగ్ర హీరోల సరసన చోటు దక్కించుకున్న విజయ్‌ భారీగా...

Vijay - Shiva Nirvana: ప్యాన్‌ ఇండియా సినిమాలకే మొగ్గు చూపుతోన్న రౌడీ హీరో.. శివ మూవీ కూడా అలానే ఉంటుందా.?
Viajy Devarakonda
Follow us on

Vijay – Shiva Nirvana: అర్జున్‌ రెడ్డితో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో పెను సంచలనంగా దూసుకొచ్చాడు విజయ్‌ దేవరకొండ. అనతి కాలంలోనే అగ్ర హీరోల సరసన చోటు దక్కించుకున్న విజయ్‌ భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమా విజయంతో విజయ్‌ రేంజ్‌ ఒకేసారి ఆకాశాన్ని తాకింది. విజయ్‌ దేవరకొండ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఎక్కడ లేని అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో దర్శక, నిర్మాతలు సైతం అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకునే కథలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక విజయ్ బాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిని క్యాష్‌ చేసుకోవడానికి దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ‘లైగర్‌’ పేరుతో భారీ మల్టీ స్టారర్‌ సినిమాను ప్లాన్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

 

ఇదిలా ఉంటే విజయ్‌ ఈ సినిమా తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీంతో విజయ్‌ చిత్రాన్ని కూడా సుకుమార్‌ అదే స్థాయిలో తెరకెక్కిస్తాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే విజయ్‌ దేవర కొండ మజిలీ ఫేం శివ నిర్వాణతో ఓ సినిమా చేయడానికి గతంలో ఓకే చెప్పిన విషయం తెలిసిందే. మరి ఇప్పటి వరకు ప్రేమ కథా చిత్రాలతో ఆకట్టుకున్న శివ.. విజయ్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తన పంథాను మార్చుకుంటాడా లేదా చూడాలి. ఇంతకీ ఈ సినిమాను కూడా ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తారో లేదో తెలియాలంటే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read: Telangana Corona: తెలంగాణలో శాంతించిన కరోనా మహమ్మారి.. కొత్తగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..

Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే ఇబ్బందులు తప్పవు.. యూరిక్ యాసిడ్ గురించి వివరంగా తెలుసుకోండి!

Covid 19 Vaccine: గుడ్ న్యూస్.. దేశంలోకి మరో కరోనా వ్యాక్సిన్.. అనుమతి ఇచ్చిన డీసీజీఐ