AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్‌’ సినిమాను తెలుగులో మిస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? చేసుంటే 1000 కోట్లు పక్కా

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'హనుమాన్ అంశ్' తెలుగు వెర్షన్ శుక్రవారం (అక్టోబర్ 09) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదట ఈ సినిమాను నేరుగా తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారట. ఒక బడా ప్రొడక్షన్ బ్యానర్ లో ఒక స్టార్ హీరోతో ఈ సినిమాను తీద్దామనుకున్నారు కానీ..

Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్‌’ సినిమాను తెలుగులో మిస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? చేసుంటే 1000 కోట్లు పక్కా
Hanuman Ansh Movie
Basha Shek
|

Updated on: Oct 09, 2026 | 5:54 PM

Share

ఈ మధ్యన చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ని ఆధారంగా తెరకెక్కించిన ఈ రియల్ స్టోరీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం రూ. 2 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ. 430 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. ఈ ఏడాది బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం ఇవాళ తెలుగులో కూడా రిలీజైంది. మొదటి షోకే ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా అద్భుతంగా వస్తున్నాయి. ఇక బుక్ మై షో యాప్ లో ఈ సినిమా తెలుగు వెర్షన్ కి గంటకు 2 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే తెలుగులోనూ హనుమాన్ అంశ్ సినిమాకు భారీ వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. కాగా ఈ సినిమాను తెలుగులో డబ్ చేసే ముందు నేరుగా తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నారట. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలుగు లో తన సోదరుడు స్టార్ హీరో వెంకటేష్ తో రీమేక్ చెయ్యాలని అనుకున్నారట. అయితే వెంకటేష్ అప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారట. దీనికి తోడు హనుమాన్ అంశ్ సినిమా పూర్తి డివోషినల్ బ్యాక్ డ్రాప్ అని, తెలుగు లో కమర్షియల్ గా వర్కౌట్ అవ్వవని అన్నారట. ఒకవేళ మన తెలుగు ఆడియన్స్ కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే , సినిమాలోని సోల్ మిస్ అవుతుందని భావించారట. అందుకే రీమేక్ వద్దని చెప్పారట. దీంతో హనుమాన్ అంశ్ సినిమాని తెలుగు లో డబ్ చేసి విడుదల చేశారట.

కాగా గతంలో హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఓ మైగాడ్ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి డివోషినల్ మూవీనే. అప్పుడు విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అయితే హనుమాన్ అంశ్ విషయంలో మాత్రం ఎందుకో వెంకీ వెనక్కు తగ్గారట. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వేళ వెంకటేష్ ఈ సినిమాను చేసుంటే బాగుండేదని, బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు వచ్చేవని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ‘హనుమాన్ అన్ష్’ సినిమా విషయానికి వస్తే.. విశాల్ చతుర్వేది ఈ డివోషినల్ మూవీకి దర్శకత్వం వహించారు. చిత్రంలో నీమ్ కరోలీ బాబా పాత్రలో శోభినవ్ సత్య నటించగా, విహాన్ షెడ్గే, చందన్ కె. ఆనంద్, పూర్ణిమా తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే,    భగవాన్‌దాస్ పటేల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

హనుమాన్ అంశ్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
‘హనుమాన్ అంశ్‌’.. తెలుగులో మిస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
‘హనుమాన్ అంశ్‌’.. తెలుగులో మిస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
అమెరికా యూనివర్సిటీల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో టాప్?
అమెరికా యూనివర్సిటీల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో టాప్?
ఓవరాక్షన్, క్రింజ్ అంటారా.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన రష్మిక
ఓవరాక్షన్, క్రింజ్ అంటారా.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన రష్మిక
వావ్ అద్భుతం.. 50 ఏళ్ల నాటి గుడిని జాకీలతో పైకెత్తుతున్న ఊరి జనం
వావ్ అద్భుతం.. 50 ఏళ్ల నాటి గుడిని జాకీలతో పైకెత్తుతున్న ఊరి జనం
చిరు - ఓదెల సినిమాపై.. నాని షాకింగ్ కామెంట్స్! ఉన్నట్టా.. లేనట్టా
చిరు - ఓదెల సినిమాపై.. నాని షాకింగ్ కామెంట్స్! ఉన్నట్టా.. లేనట్టా
టీవీలోకి వచ్చేస్తున్నా రామ్ చరణ్ పెద్ది..
టీవీలోకి వచ్చేస్తున్నా రామ్ చరణ్ పెద్ది..
దిమ్మతిరిగే ఫోక్‌ సాంగ్‌తో.. కంబ్యాక్‌ ఇచ్చిన మాధురి రాథోడ్‌
దిమ్మతిరిగే ఫోక్‌ సాంగ్‌తో.. కంబ్యాక్‌ ఇచ్చిన మాధురి రాథోడ్‌
శివాజీ మహరాజ్‌ గడ్డపై.. ఐకాన్ స్టార్‌ సేవా కార్యక్రమం
శివాజీ మహరాజ్‌ గడ్డపై.. ఐకాన్ స్టార్‌ సేవా కార్యక్రమం
ఏఐతో అసభ్యక పోస్టులు.. కోర్టుకెక్కిన నటి
ఏఐతో అసభ్యక పోస్టులు.. కోర్టుకెక్కిన నటి
బ్రెష్ అవసరం లేదు.. రుద్దే పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో..
బ్రెష్ అవసరం లేదు.. రుద్దే పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో..