Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ సినిమా వాయిదా పడనుందా..?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిందని తెలిసి ఆయన అభిమానులు అందరు ఆందోళనకు గురయ్యారు. అయితే అభిమానులు కంగారు పడాల్సిన అవసరం ..
Sai Dharam Tej Accident: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిందని తెలిసి ఆయన అభిమానులు అందరు ఆందోళనకు గురయ్యారు. అయితే అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని తేజ్ త్వరగానే కోలుకుంటున్నాడని వైద్యులు.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. దాంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సాయి ధరమ్ తేజ్ మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. రోడ్డు పై ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు తేజ్‌ను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆతర్వాత మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదంలో తేజ్ షోల్డర్ బోన్ విరగడంతో సర్జరీ చేశారు అపోలో వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో తేజ్ నటించిన సినిమా రిలీజ్ వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. సాయిధరమ్ తేజ్ కోలుకోవడానికి కనీసం 6నుంచి 10 నెలలు పెట్టె అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. దాంతో తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా వాయిదా పడనుందని ఓ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. తేజ్ హీరోగా దర్శకుడు దేవ కట్టా ‘రిపబ్లిక్’ సినిమాను రూపొందించాడు. భగవాన్ – పుల్లారావు నిర్మించిన ఈ సినిమా, రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను.. అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో తేజ్ పాల్గొనే అవకాశం లేదు.. అందువలన మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇక ఈ సినిమా రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :