యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 18 పేజెస్. రీసెంట్ గా కార్తికేయ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ఈ కుర్ర హీరో.. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్ పై ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఈ సినిమాలో నిఖిల్ విభిన్న మైన పాత్రలో కనిపించనున్నాడట. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కొత్త కష్టం వచ్చిందని తెలుస్తోంది. 18 పేజెస్ మూవీని రీషూట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కార్తికేయ 2 సినిమా సూపర్ హిట్ అవ్వడంతో నిఖిల్ 18 పేజెస్ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారని టాక్.
త్వరలో వాటిని పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేస్తారని అంటున్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం అనౌన్స్ చేసింది. దాంతో సినిమా రూమర్స్ పై క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 23న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు మళ్లీ సినిమాకు సంబంధించి షూటింగ్ జరపనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కొంత వర్క్ చేయాల్సి ఉందని, పెండింగ్ షూటింగ్ త్వరలో ప్రారంభం అని టాక్ వినిపిస్తుంది. ఇటీవల శింబుతో ఓ పాట పాడించారు. అయితే ఈ పాటకు సంబందించిన షూట్ జరిగిందా లేక పాత పాటనే పెట్టేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే కథ విషయంలోనూ అల్లు అరవింద్, సుకుమార్ కొన్ని మార్పులు చెప్పారట. అవే ఇప్పుడు మారుస్తున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..