Naga Chaitanya : నాగచైతన్య నెక్స్ట్ సినిమా ఆగిపోయిందా..? ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త

|

Mar 27, 2021 | 7:43 AM

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన నటించిన లవ్ స్టోరీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Naga Chaitanya : నాగచైతన్య నెక్స్ట్ సినిమా ఆగిపోయిందా..? ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త
Naga Chaitanya
Follow us on

Naga Chaitanya : అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన నటించిన లవ్ స్టోరీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన లవ్ స్టోరీ సాంగ్స్ , టీజర్ సినిమాపైనే అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా తర్వాత అక్కినేని ఫ్యామిలీకి మనంలాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది.

థాంక్యూ సినిమాలో చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా తర్వాత చైతన్య మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడని తెలుస్తుంది. టాలీవుడ్ లో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. థాంక్యూ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ తోనూ ఓ సినిమా చేయనున్నాడట చైతన్య . తరుణ్ భాస్కర్ సినిమా పూర్తయిన తర్వాత ఇంద్రగంటి సినిమా తెరకెక్కబోతుందని టాక్. అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ సుధీర్ బాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. సుధీర్ బాబుతో కలిసి ఇప్పటివరకు ఇంద్రగంటి రెండు సినిమాలు చేసాడు. సమ్మోహనం, వి సినిమాల తర్వాత ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు.  ఇటు ఇంద్రగంటి అటు నాగచైతన్య తమ సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. నాగార్జున కథానాయకుడిగా దిల్ రాజు నిర్మిస్తున్న బంగార్రాజు చిత్రంలో నాగచైతన్య నటించాల్సి ఉంది. దీనివల్ల కాల్షీట్ల పరంగా సమస్య తలెత్తిందట. దాంతో ఇంద్రగంటి సినిమా ఆగిపోయిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ వార్తలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiru Wishes to Charan: అప్పుడు , ఇప్పుడు, ఎల్లప్పుడూ హి ఈజ్ కేరింగ్ సన్ అంటూ తనయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన చిరు

Actress Pragathi: కూతురిని ఓ ఆటాడేసుకున్న ప్రగతి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..