గత సంవత్సరం విడుదలైన ‘మహావతార్ నరసింహ’ అనే యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది . అంతే కాదు ఈ మూవీ భారతీయ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన మొదటి యానిమేషన్ చిత్రం కూడా. క్లీన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాన సారథ్యంలో అశ్విన్ కుమార్ ఈ సినిమాను తెరరకక్కించారు. ప్రతిష్ఠాత్మక హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది. ‘మహావతార్ నరసింహ’ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించారు. కేవలం రూ. 15 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు 98వ ఆస్కార్ అవార్డుల్లో యానిమేషన్ కేటగిరీలో ఈ మూవీకి స్థానం దక్కింది. అయితే ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది ఈ మూవీని కాపీయింగ్ అని ఆరోపిస్తున్నారు.
మహావీర్ నరసింహ’ సినిమాలోని కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందులోని కొన్ని పోరాట సన్నివేశాలను ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ ని పోలి ఉన్నాయంటూ కొన్ని వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. ఈ వీడియో చూస్తే, ‘మహావతార్ నరసింహ’, ‘గాడ్ ఆఫ్ వార్’ పోరాట సన్నివేశం దాదాపు ఒకేలా ఉంది. అయితే నేపథ్యం, పాత్రల తీరు మాత్రం వేరుగా ఉన్నాయి. దీంతో పాటు మరో హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ఇన్క్రెడిబుల్ హల్క్’ సినిమా నుంచి కూడా కొన్ని సన్నివేశాలను కాపీ చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై మూవీ దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
మరోవైపు ‘మహావతార్ నరసింహ’ సినిమా నిర్మాతలు, దర్శకుడు ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్స్‌ను ప్రకటించారు. భవిష్యత్తులో విష్ణు వివిధ అవతారాలపై సినిమాలు నిర్మిస్తామని వారు చెప్పారు. ‘మహావతార్ పరశురామ్’, ‘మహావతార్ రఘునందన’, ‘మహావతార్ ద్వారకాదీష్’, ‘మహావతార్ గోకులానంద’, ‘మహావతార్ కల్కి 1’, ‘మహావతార్ కల్కి 2’ వంటి సినిమాలు నిర్మిస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
Copy and pasted 🤭 pic.twitter.com/JiNDv41ysE
— Black Thunder ⚡️ (@BT_BlackThunder) November 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.