2022లో విడుదలైన RRR చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు అభిమానులు తారక్ తదుపరి చిత్రం ‘దేవరా’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. దేవర సినిమాతో పాటు చాలా సినిమాలను ఎన్టీఆర్ లైనప్ చేశారు. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు ఓ క్రేజీ దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగాతో ఎన్టీఆర్ కలిసి నటించడంపై చర్చలు మొదలయ్యాయి.
రణబీర్ కపూర్ కెరీర్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.917 కోట్లు రాబట్టిన ‘యానిమల్’ సినిమాని అందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. షాహిద్ కపూర్‌తో ‘కబీర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను కూడా తీశాడు. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి. ఇప్పుడు ఎన్టీఆర్, సందీప్ కలసి పని చేయవచ్చని అంటున్నారు. నేడు( సెప్టెంబర్ 10న) దేవర ట్రైలర్ విడుదల కానుంది. ఇందుకోసం ముంబైలో ఓ ఈవెంట్ కూడా ఏర్పాటు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ముంబైలోనే ఉన్నాడు. కాగా, ముంబైలో సందీప్ రెడ్డి వంగాను కలిశారు తారక్. వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ తమ సినిమాల గురించి అలాగే రాబోయే చిత్రాల గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం కూడా ఉంది. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుండు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ ‘దేవరా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాతో బిజీగా ఉన్నాడు వంగ. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది కాకుండా, అతను ‘యానిమల్’ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. యానిమల్ చిత్రానికి సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ తీయబోతున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.