Thalapathy vijay: దళపతి విజయ్‌తో బాలయ్య డైరెక్టర్ మూవీ చేయనున్నాడా..?
తమిళ, తెలుగు బాషల్లో బైలింగువల్ ఫిల్మ్ గా తెరకెక్కబోయే ఈ సినిమాను.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనున్నారనే టాక్ కూడా ఫిల్మ్ సిటీలో తెగ వైరల్ అవుతోంది. అందరి అటెక్షన్ను గ్రాబ్ చేస్తోంది

ఓ పక్క తమిళ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేస్తుంటే.. మరో పక్క తెలుగు డైరెక్టర్లు మాత్రం తమిళ్ హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వంశీ పైడిపల్లి, వెంకీ అట్లూరీ కోలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు. ఇక వారి దారిలోనే మరో యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కూడా తన జెర్నీని స్టార్ట్ చేస్తున్నారట.
బాలయ్య వీరసింహా రెడ్డితో.. రీసెంట్‌గా.. రోరింగ్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని.. తొందర్లో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌ను డైరెక్ట్ చేయబోతున్నారట. తన స్టైల్ ఆఫ్ నరేషన్లో సాగే.. ఓ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసుకుని రీసెంట్‌గా దళపతిని కలిసి ఓకే చెప్పించుకున్నారట.
అంతేకాదు.. తమిళ, తెలుగు బాషల్లో బైలింగువల్ ఫిల్మ్ గా తెరకెక్కబోయే ఈ సినిమాను.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనున్నారనే టాక్ కూడా ఫిల్మ్ సిటీలో తెగ వైరల్ అవుతోంది. అందరి అటెక్షన్ను గ్రాబ్ చేస్తోంది. ఇప్పటికే విజయ్ వంశీ పైడిపల్లి తో కలిసి వారసుడు సినిమా చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మతగా వ్యవహరించిన ఈ సినిమా తమిళ్ కంటే తెలుగులోనే మంచి వసూళ్లను రాబట్టింది. తమిళ్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. తెలుగులో పర్లేదనిపించుకుంది. మరి ఇప్పుడు గోపీచంద్ విజయ్‌తో ఎలాంటి సినిమా చేసి హిట్ కొడతాడో చూడాలి. ప్రస్తుతం విజయ్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.