
తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యోగిబాబు. కమెడియన్ గా వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు యోగిబాబు. స్టార్ హీరోల సినిమాల్లో తప్పకుండా యోగిబాబు నటిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకు కూడా యోగిబాబు సుపరిచితుడే.. శివకార్తికేయన్ నటించిన డాన్ సినిమాలో నటించాడు యోగి బాబు. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. అలాగే దళపతి వారసుడు సినిమాలోనూ నటించాడు. ఇక ఇప్పుడు యోగిబాబు డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించనున్నాడని తెలుస్తోంది. యోగిబాబు కు ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. టాలీవుడ్ లో యోగి బాబు ఓ బడా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్నాడని టాక్ వినిపిస్తుంది.
యోగిబాబు ఇప్పుడు స్ట్రైట్ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో యోగిబాబు నటిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా పై ఇప్పటికే చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మారుతీ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ నటిస్తారని కూడా టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా యోగిబాబు కూడా నటిస్తున్నారని టక వినిపిస్తుంది. ప్రభాస్, యోగిబాబు కాంబినేషన్స్ లో వచ్చే సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.