Dhanush and Aishwarya Rajinikanth : ఊహించని ట్విస్ట్.. ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలవనున్నారా..?

ఇటీవలే ధనుష్ తన భార్యతో విడిపోతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు. ధనుష్ తన భార్య ఐశ్వర్య ఇద్దరు విడిపోతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఈ విషయాన్నీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు ధనుష్ ఫ్యాన్స్.

Dhanush and Aishwarya Rajinikanth : ఊహించని ట్విస్ట్.. ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలవనున్నారా..?
Dhanush And Aishwarya Raji

Updated on: Oct 02, 2022 | 11:27 AM

స్టార్ హీరో ధనుష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ధనుష్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. వరుస సినిమాలతో దూసుకుపోతోన్న ధనుష్. ఇప్పుడు తెలుగులో స్టైయిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘సార్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ధనుష్. ఇదిలా ఉంటే ఇటీవలే ధనుష్ తన భార్యతో విడిపోతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు. ధనుష్ తన భార్య ఐశ్వర్య ఇద్దరు విడిపోతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఈ విషయాన్నీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు ధనుష్ ఫ్యాన్స్. దాదాపు 18ఏళ్ల వివాహబంధానికి స్వస్తిపలుకుతున్నటు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

అయితే వీరిద్దరూ తిరిగి కలిస్తే బాగుండు అను అంతా అనుకున్నారు. ఇప్పుడు ఇదే నిజంకాబోతుందని తెలుస్తోంది. విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో తమ పేర్లను మార్చుకుని కలిసి ఉన్న ఫొటోలను తొలగించారు. తాజాగా ఈ ఇద్దరు మళ్లీ కలుస్తున్నారన్న వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అయితే ధనుష్ , ఐశ్వర్య మధ్య మనస్పర్థలు తొలగించేందుకు.. పెద్దలు సమస్యను పరిష్కరించారని తెలుస్తోంది.

దీంతో ఈ జంట విడాకుల ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. రజనీకాంత్.. ఆమె కుటుంబ పెద్దల సమక్షంలో జరిగిన చర్చల్లో పెద్దల మాటలను గౌరవిస్తూ సానుకూల నిర్ణయం  తీసుకున్నారని అంటున్నారు. ఇక ఈ విషయంపై త్వరలోనే  క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి