AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: చిరంజీవి, మహేష్‌ రిజెక్ట్ చేసిన కథతో ప్రభాస్ సినిమా.. కట్ చేస్తే.. డార్లింగ్ కెరీర్‌లోనే డిజాస్టర్

ఈ ఏడాది ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు ప్రభాస్. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ అనే మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు డార్లింగ్. దీంతో పాటు ఫౌజీ, సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా ప్రభాస్ కంప్లీట్ చేయాల్సి ఉంది.

Cinema: చిరంజీవి, మహేష్‌ రిజెక్ట్ చేసిన కథతో ప్రభాస్ సినిమా.. కట్ చేస్తే.. డార్లింగ్ కెరీర్‌లోనే డిజాస్టర్
Mahesh, Chiru, Prabhas
Basha Shek
|

Updated on: May 22, 2026 | 4:01 PM

Share

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ మధ్యన సందీప్ రెడ్డి వంగా చెప్పినట్లు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్న ట్యాగ్ కు ప్రభాస్ అన్ని విధాలా అర్హుడు. ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ చేస్తోన్న ప్రాజెక్టులను చూస్తుంటే సందీప్ రెడ్డి చెప్పింది కరెక్టే అని పిస్తోంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్ సాహో, సలార్, కల్కి సినిమాలతో అందనంత ఎత్తుకు ఎదిగపోయాడు. ది రాజా సాబ్ కొంచెం నిరాశపర్చినా ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవుద్ది. హను రాఘవపూడి ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ లతో పాటు సలార్ 2, కల్కి 2 సినిమాలు డార్లింగ్ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే మరికొందరు స్టార్ డైరెక్టర్లు కూడా ప్రభాస్ తో సినిమా చేయడనికి క్యూలో ఉన్నారు. అయితే చాలా మంది హీరోల్లాగే ప్రభాస్ కెరీర్ లోనూ కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. అందులో ఓ సినిమా అయితే కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసనా డేర్ చేశాడు ప్రభాస్. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ లాంటి స్టార్ హీరోలు సైతం ఆ సినిమా కథ విని వెనక్కు తగ్గారు. కానీ ప్రభాస్ ధైర్యం చేశాడు.. కట్ చేస్తే.. ఆ సినిమా డార్లింగ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. ఆ సినిమా మరేదో కాదు చక్రం.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం చక్రం. ఇందులో ప్రభాస్ నటన అద్భుతంగా ఉంటుంది. కొన్ని చోట్ల కన్నీళ్లు కూడా తెప్పిస్తాడు. కానీ ఈ సినిమాలో ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ ఉండవు. పైగా ఈ మూవీ క్లైమాక్స్ లో ప్రభాస్ చనిపోతాడు. అందుకే అభిమానులు చక్రం సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ సినిమా ఛాన్స్ ముందుగా మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లిందట. కానీ ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఆ తర్వాత మహేష్ బాబు వద్దకు వెళ్లినా సేమ్ సిచ్యువేషన్. దీంతో కృష్ణవంశీ చివరకు ప్రభాస్ తో ఈ సినిమా చేసి డేర్ చేశారని సమాచారం. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలినా ప్రభాస్ కెరీర్ లో ఓ డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. ముఖ్యంగా జగమంత కుటుంబం నాది సాంగ్ అయితే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆసిన్, ఛార్మి, ప్రకాశ్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us