Karuppu Movie: ‘కరుప్పు’ సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా? చేసుంటే 1000 కోట్లు పక్కా!

కోలీవుడ్ స్టార్ హీరో నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు. తెలుగులో వీరభద్రుడిగా రిలీజైంది. మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పలు రికార్డులను బద్దలు కొట్టింది.

Karuppu Movie: కరుప్పు సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా? చేసుంటే 1000 కోట్లు పక్కా!
Karuppu Movie

Updated on: May 21, 2026 | 2:22 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొన్నేళ్లుగా వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న కంగువా, రెట్రో సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయి. అయితే కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమాతో సూర్య ఎట్టకేలకు సక్సెస్ ట్రాక్ ఎక్కాడని అతని అభిమానులు చెబుతున్నారు. మే 15న రిలీజైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ మరోసారి సూర్య స్టామినాను ప్రూవ్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్‌గా నటించింది. ఆర్జే బాలాజీనే విలన్ గా ఆకట్టుకున్నాడు. వీరితో పాటు ఇంద్రాన్స్, అనాఘా, మన్సూర్ అలీఖాన్, జార్జి మరియన్, ఆడుకలం నరేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే కరుప్పు సినిమా అంతా సూర్య వన్ మ్యాన్ షోగానే సాగింది. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. కరుప్పు సినిమాకు హీరో సూర్య ఫస్ట్ ఛాయిస్ కాదట.

ఆ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ముందుగా ఈ కథని వినిపించాడట. అది కూడా రెండేళ్ల క్రితమే. అంటే పుష్ప 2 సినిమా షూటింగ్ సమయంలో కరుప్పు సినిమా కథ బన్నీకి చెప్పాడట బాలాజీ. అల్లు అర్జున్ కూడా సినిమ కాన్సెప్ట్, కథ కూడా చాలా బాగా నచ్చాయట. అయితే ద్వితీయార్థంలో కొన్ని మార్పులు సూచించాడట బన్నీ. దీనికి బాలాజీ చాలా సమయం తీసుకున్నాడట. ఇంతలోనే బన్నీ పుష్ప 2 తో బిజీ అయిపోవడం ఆతర్వాత అట్లీ, లోకేశ్ కనగరాజ్ లతో కమిట్ అవ్వడంతో ఆర్జే బాలాజీ సూర్యకు ఈ కథ వినిపించాడట. స్టోరీ విన్న సూర్య వెంటనే ఒకే చెప్పాడట. ఇక ఆ తర్వాత జరిగింది మొత్తం హిస్టరీ. ఒకవేళ అల్లు అర్జున్ ఈ సినిమా చేసి ఉంటే పుష్ప తరహాలో మరో ఇండస్ట్రీ హిట్ అయ్యేదని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వీరభద్రుడు గెటప్ బన్నీకి సరిగ్గా సరిపోతుందని, దీనికి తోడు ఇప్పుడు పాన్ ఇండియాలో దేవుడి సినిమాల కాన్సెప్ట్ కు మంచి క్రేజ్ ఉందంటున్నారు. ఆ లెక్కన బన్నీ ఈ మూవీ చేసి ఉంటే ఈజీగా వెయ్యి కోట్లు వచ్చేదని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us