Pawan Kalyan: ఓజీ (OG) అంటే ఒరిజినల్ గ్యాంగ్‎స్టర్ కాదు.. అసలు పేరు అదేనట.. పవన్ పాత్రపై క్రేజీ అప్డేట్..

|

Aug 23, 2023 | 7:59 AM

తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‏గా వచ్చింది ఈ సినిమా. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో పవన్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైనే ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఓజీ చిత్రం ఒకటి.

Pawan Kalyan: ఓజీ (OG) అంటే ఒరిజినల్ గ్యాంగ్‎స్టర్ కాదు.. అసలు పేరు అదేనట.. పవన్ పాత్రపై క్రేజీ అప్డేట్..
Pawan Kalyan's Og Movie
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇటీవల బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్. మొదటి సారి తన మేనల్లుడితో కలిసి నటించిన ఈ సినిమాకు నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‏గా వచ్చింది ఈ సినిమా. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో పవన్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైనే ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఓజీ చిత్రం ఒకటి.

సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ నటించిన సాహో అనంతరం డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తోన్న సినిమా. ఇందులో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఈ సినిమాకు OG అనే టైటిల్ పరిశీలనలో ఉంచారు.

దాదాపు ఈ టైటిల్ తోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. దీంతో అదే టైటిల్ ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ అది టైటిల్ కాదట.

తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీరా. అందరు కూడా ఓజీ అని పిలుస్తుంటారట. అందుకే ఈ సినిమాకు ఓజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం త్వరలోనే థాయ్ లాండ్ వెళ్లనుంది చిత్రయూనిట్.

ఈ సినిమాతోపాటు.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోనూ నటిస్తున్నారు పవన్. ఇందులో మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.గతంలో విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.