
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులంతా ఎంతగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఆనందం అంతా ఇంతాకాదు.. సినిమా రిలీజ్ అయ్యిందంటే ఫ్యాన్స్ కు పండగే.. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో పేక్షకుల ముందుకు వచ్చాడు పవర్ స్టార్. ఈ సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత గబ్బర్ సినిమా సినిమాతో పవన్ అభిమానుల ఆకలి తీర్చున హరీష్ శంకర్ ఇప్పుడు మరో సినిమా చేయడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా దేశ భక్తి నేపథ్యంలో ఉంటుందనీ… లేదు మరోసారి పోలీస్ కథతో సినిమా ఉంటుందనీ వార్తలు వినిపించాయి. తాజాగా మరో వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో పవన్ రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడట. అందులో ఒకటి కాలేజ్ లెక్చరర్ గా .. మరో పాత్రలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ రెండు పాత్రలను హరీశ్ శంకర్ డిజైన్ చేసిన తీరు ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం కాలేజ్ సెట్ కూడా వేసారట. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జులై నుంచి ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :