
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మలయాళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా సినిమాలు తీస్తున్నాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లతో తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు దుల్కర్. ఇప్పుడు ఆకాశంలో ఒక తార అంటూ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పవన్ సాధినేని దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమాలో హీరోయిన్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ మూవీ టీం ఓ వీడియో రిలీజ్ చేసింది. దీనికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. హీరోయిన్ చాలా క్యూట్ గా ఉందని కాంప్లిమెంట్స్ వచ్చాయి. అలాగే ఈ హీరోయిన్ ఎవరని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.
ఆకాశంలో ఒక తార సినిమాలో నటిస్తోన్న హీరోయిన్ పేరు ‘సాత్విక వీరవల్లి’. 2000లో పుట్టిన ఈమె యూఎస్ లోని వాండర్ బిల్ట్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసింది. తల్లి క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో సాత్విక కూడా చిన్నతనం నుంచే నృత్యంలో శిక్షణ తీసుకుంది. స్టేజీ ప్రదర్శనల ద్వారానే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది.
Once Again, @gvprakash Proves His Mastery With A Powerful And Memorable Background Score in the #AakasamLoOkaTara Glimpsepic.twitter.com/imSJ6Omxpl
— Milagro Movies (@MilagroMovies) January 19, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.