IBomma Ravi:ఆ కోపంతో భార్యే పట్టించింది.. ఐబొమ్మ నిర్వాహకుడు రవి పోలీసులకు ఎలా చిక్కాడో తెలుసా?

సినిమాలు పైరసీ చేస్తూ నిర్మాతలకు కంటిలో నలుసులా మారిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. శనివారం (నవంబర్ 15) హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐ బొమ్మ రవిని అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తుంది.

IBomma Ravi:ఆ కోపంతో భార్యే పట్టించింది.. ఐబొమ్మ నిర్వాహకుడు రవి పోలీసులకు ఎలా చిక్కాడో తెలుసా?
Ibomma Ravi

Updated on: Nov 15, 2025 | 9:31 PM

ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శనివారం (నవంబర్ 15) సైబర్ క్రైమ్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ముఖ్యమైన పని నిమిత్తం రవి శుక్రవారం (నవంబర్ 14) ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడని, కూకట్ పల్లిలోని రెయిన్ విస్టా ప్లాట్లో ఉండగా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి మరీ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో రవి నివాసం నివాసం నుంచి కీలకమైన హార్డ్ డిస్కులు, ల్యాప్ టాప్స్, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్ డీ ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐ-బొమ్మ వెబ్ సైట్ సర్వర్ నుంచి సమాచారం కూడా సేకరించారు. అప్ లోడ్ కు రెడీగా ఉన్న కొన్ని కొత్త సినిమాల హర్డ్ డిస్క్ లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక విచారణంలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది.

కాగా రవి వైజాగ్ కు చెందిన వ్యక్తి. అయితే హైదరాబాదులో కూకట్ పల్లిలో అతనికి ఒక అపార్ట్మెంట్ ఉంది. ప్రస్తుతం అందులోనే నివాసముంటున్నాడు. అయితే రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు కూడా రెడీ అయినట్లు సమాచారం. ఇప్పుడు విదేశాలలో ఉన్నరవి తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసమే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడని టాక్. రవి హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని స్వయంగా అతని భార్యనే సైబర్ క్రైమ్ పోలీసులకు చేరేవేసినట్టు తెలుస్తోంది. రవి భార్య సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా ఉంచి ఆయనని పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారని సమాచారం.

ఏదేమైనా ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ పట్ల సినిమా దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ.. పలు సినిమాలు, ఓటీటీ కంటెంట్ ల మూవీస్ పైరసీలు చేస్తున్నాడు. దీంతో ఇటీవలే టాలీవుడ్ నిర్మాతలు పైరసీపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు గత కొద్ది రోజులుగా చాలామందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఐ బొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.