AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ilaiyaraaja: మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం రానున్న మ్యూజికల్‌ స్కూల్‌..

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా మ్యూజికల్‌ స్కూల్‌. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Ilaiyaraaja: మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం రానున్న మ్యూజికల్‌ స్కూల్‌..
Ilaiyaraaja
Rajeev Rayala
|

Updated on: Mar 13, 2022 | 7:47 AM

Share

Music School : మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా మ్యూజికల్‌ స్కూల్‌. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా  మ్యూజికల్‌ స్కూల్‌ సినిమా మూడో షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 45రోజుల షెడ్యూల్‌లో 10 పాటల చిత్రీకరణ పూర్తిచేశారు. ఇంకో పాట చిత్రీకరణ మిగిలింది. చిన్ని ప్రకాష్‌, రాజు సుందరం ఈ పాటలకు కొరియోగ్రఫీ చేశారు. తొలి రెండు షెడ్యూళ్లకు బ్రాడ్వే కొరియోగ్రాఫర్‌ ఆడం ముర్రే నృత్య దర్శకత్వం వహించారు. ప్రేక్షకులకు గుర్తుండిపోయే మ్యూజికల్‌ సినిమాను ఇవ్వాలన్న ఆకాంక్షతో మేకర్స్ ఫైనల్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా శ్రియ శరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా.. శ్రియా శరణ్‌ మాట్లాడుతూ ”అమేజింగ్‌ షూట్‌ కంప్లీట్‌ చేశాం.  చిన్ని ప్రకాష్‌ సార్‌, రాజు మాస్టర్‌ కొరియోగ్రఫీ చాలా బావుంది. షర్మన్‌తోనూ, పలువురు చైల్డ్ ఆర్టిస్టులతోనూ షూటింగ్‌ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా చేస్తున్నందుకు పాపారావు సార్‌కి ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చారు.

అలాగే షర్మన్‌ జోషి మాట్లాడుతూ ”మ్యూజిక్‌ స్కూల్‌ మూడో షెడ్యూల్‌ పూర్తయింది. చాలా మంది పిల్లలు పార్టిసిపేట్‌ చేసిన డ్యాన్సులు, పాటల సీక్వెన్స్ లు పూర్తి చేశాం. రావుగారి టీమ్‌ చాలా బాగా హ్యాండిల్‌ చేసింది. ప్రతి విభాగంలోనూ ఎక్సలెన్స్ కోసం పాటుపడుతూ ముందుకు సాగుతుంటే ఆనందంగా ఉంది” అని అన్నారు. రాజు సుందరం మాట్లాడుతూ ”ప్రతిభావంతులైన చిన్నారులతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. పాపారావు సార్‌కి, కిరణ్‌కి ధన్యవాదాలు” అని అన్నారు. ఇక దర్శకుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ ”నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా పిల్లలు చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బెటర్‌ ఔట్‌పుట్‌ కోసం నేను ప్రత్యేకించి ఎవరినీ అడగలేదు. అందరూ అంతగా ఇన్వాల్వ్ అయి చేశారు. 80 శాతం షూటింగ్‌ పూర్తయింది. మేం అనుకున్న టైమ్‌ ప్రకారం సినిమా పూర్తవుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. హిందీ, తెలుగులో ఈ మ్యూజిక్‌ స్కూల్‌ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో షర్మన్‌ జోషి, శ్రియా శరణ్‌ లతోపాటు షాన్‌, సుహాసిని మూలే, ప్రకాష్‌ రాజ్‌, బెంజమిన్‌ జిలానీ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వినయ్‌ వర్మ, మోనా మోనా అంబేగవోంకార్‌, గ్రేసీ గోస్వామీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Varun Sandesh: పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..

Mirnalini Ravi: నెమలి సోకు సోయగం తో మైమరిపిస్తున మృణాళిని రవి

Viral Photo: అందాల రాశి.. కుర్రకారును పిచ్చెక్కిస్తున్న క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి.!

Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!