Allu Arjun: ఐకాన్ స్టార్‌కు ‘పుష్ప’ లారీ గిఫ్ట్.. మురిసిపోతున్న బన్నీ.. ఎవరిచ్చారో తెల్సా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నారు. దాన్ని సోషల్ మీడియలో షేర్ చేసి తెగ ఆనందపడుతున్నారు.
ఐకాన్ స్టార్ తనకు వచ్చిన అరుదైన గిఫ్ట్ చూసి ఉప్పొంగిపోతున్నారు. ఆయన హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్‌లో దుమ్మురేపింది. ఎర్ర చందనం స్మగ్లర్‌గా టిపికల్ బాడీ లాంగ్వెజ్‌తో రచ్చ చేశాడు బన్నీ. దీనికి సీక్వెల్‌గా పుష్ప ది రైజ్ తెరకెక్కుతుంది. ఈ సమయంలోనే తన కుమారుడు అయాన్ నుంచి క్రేజీ గిఫ్ట్ అందుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప మూవీలో లారీలో చందనం దుంగలు స్మగ్లింగ్ చేస్తూ కనిపిస్తాడు బన్నీ. అలాంటి లారీ బొమ్మను తన తండ్రికి గిఫ్ట్‌గా ఇచ్చాడు అయాన్. దీంతో బన్నీ సంతోషం అంతా ఇంతా కాదు. ఆ బొమ్మ లారీ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేసి మురిసిపోతున్నాడు బన్నీ. చినబాబు అయాన్ నుంచి వచ్చిన అందమైన గిఫ్ట్’ అని రాసుకొచ్చారు.
View this post on Instagram
ప్రస్తుతం అల్లు అర్జున్ పోస్ట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. పుష్ప’లో లారీ మాదిరిగానే ఈ బొమ్మ కూడా రంగురంగులుగా ఉంది. టాప్‌పైన ‘పుష్ప’ అని ఇంగ్లీషులో రాసి ఉంది. ‘పుష్ప’ సంచలన విజయం సాధించిన తర్వాత తర్వాత సెకండ్ పార్ట్ కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఫస్ట్ పార్ట్‌కు అనుకోని రీతిలో స్పందన రావడం, బాలీవుడ్‌లోనూ ‘పుష్పరాజ్’ దుమ్ము రేపడంతో ‘పుష్ప: ది రైజ్’ స్క్రిప్ట్‌ను ఇంకాస్త మెరుగుపరిచాడు డైరెక్టర్ సుకుమార్.
ఇప్పటికే ఈ మూవీ థాయిలాండ్‌లో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ప్రజంట్ తెలుగు రాష్ట్రాల్లోనే చిత్రీకరణ జరుపుకొంటోంది. నటీనటులపై కీలక సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ‘పుష్ప’లో నటించిన రష్మిక, సునీల్, ఫహద్ ఫాజిల్, అనసూయ పాత్రలతో పాటు కొత్త క్యారెక్టర్‌లను పరిచయం చేయబోతున్నారు సుకుమార్. కాగా ‘పుష్ప2’ గురించి అప్‌డేట్ ఇవ్వాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.