Pushpa: రంగస్థలం సినిమాతో చెర్రీలోని నాచురల్ యాక్టింగ్ ని బయటికి తీసి కల్ట్ క్లాసిక్ సినిమాగా మార్చిన సుకుమార్.. ఆ వెంటనే బన్నీతో ఓ సినిమాను అనౌన్స చేశారు. అయితే స్టైలిష్ స్టార్ సినిమా అనడంతో.. అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. పుష్ప సినిమా కోసం బన్నీ మునుపెన్నడూ చూడని లుక్ లోకి మార్చేశారు లెక్కలమస్టర్..రంగు రంగుల బట్టల్లో… చెదిరిపోని క్రాఫ్తో.. చెరిగిపోని మేకప్‌తో…! సినిమాల్లో చాలా స్టైలిష్గా కినిపించే.. అల్లు అర్జున్.. నౌ.. తన రూటును మార్చుకున్నారు. ఊరమాసుగా.. పుష్పరాజ్‌గా… మన ముందుకు రాబోతున్నారు. మట్టి బట్టల్లో.. గుబురు గడ్డంతో.. బుట్టలాంటి తల జుట్టుతో… తగ్గేదే లే అంటూ.. తన యాక్షన్‌ను మరో సారి మనకు చూపించబోతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వారు విడుదలైన పోస్టర్లు, టీజర్ , పాటలు సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.
ఈ సినిమా విడుదల కోడం బన్నీ ఆర్మీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో లకీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఏ ఈసినిమా మొదటి భాగం డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. డిసెంబర్ 6వ తేదీన ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 12న జరిగే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.