AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: “పుష్ప-1” ట్రైలర్ కోసం భారీ స్కెచ్ వేసిన సుకుమార్.. రిలీజ్ ఎప్పుడంటే..

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

Pushpa: పుష్ప-1 ట్రైలర్ కోసం భారీ స్కెచ్ వేసిన సుకుమార్.. రిలీజ్ ఎప్పుడంటే..
Pushp
Rajeev Rayala
|

Updated on: Nov 23, 2021 | 6:34 PM

Share

Pushpa: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకోసం బన్నీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే పాటలు ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను దక్కించుకుంటున్నాయి ఈ సాంగ్స్ .

ఇక ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తుంది. విడుదలకు ఒక నెల రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఈ గ్యాప్ లోనే చిత్రీకరణ పూర్తి చేయాలి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసి ప్రమోషన్స్ ముమ్మరం చేయాలి. పైగా పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇతరభాషల్లో కూడా డబ్బింగ్ పూర్తి చేయాలి ఇలా చాలా పనులు ఉన్నాయి. ఈ క్రమంలోనే పుష్ప ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని తెలుస్తుంది. డిసెంబర్ మొదటి వారంలో పుష్ప ట్రైలర్ ను విడుదల చేయనున్నారని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ మొదటివారంలో దుబాయ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం చివరి సాంగ్ ను షూట్ చేస్తున్నారట. ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. దేవీ శ్రీ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు .

Shahid Kapoor Jersey Trailer : మరోసారి నటనతో కట్టిపడేసిన షాహిద్.. “జెర్సీ” ట్రైలర్

Naga Chaitanya : “థాంక్యూ” సినిమా నుంచి అక్కినేని నాగచైతన్య ఫస్ట్ లుక్.. అదుర్స్..

Sampoornesh Babu: తూర్పు గోదావరి జిల్లాలో సంపూర్ణేష్‌ సందడి.. స్వచ్ఛంద సంస్థకు విరాళం అందజేత..

Follow Us
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
నెలకు మా సంపాదన ఎంతంటే.. ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన శివకుమార్..
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎలా తయారుచేస్తారో తెలుసా..?
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం