కింగ్ నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు నాతో సినిమా చేస్తున్నాడు. కుర్ర హీరోలకు పోటీగా నాగార్జున వరుస దూసుకుపోతున్నాడు. ఓ వైపు నాగ్ కుమారులు నాగచైతన్య , అఖిల్ సినిమాలు చేస్తున్నప్పటికీ నాగ్ మాత్రం ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా తన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల మునుకు వచ్చాడు నాగార్జున. కోవిడ్ కారణంగా కొన్ని వారాల్లోనే థియేటర్ రన్ కంప్లీట్ చేసుకున్న నాగ్ మూవీ వైల్డ్ డాగ్.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో సత్తా చాటింది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో… రా అండ్ రస్టిక్ యాక్షన్ తో NIA ఆఫీసర్ రోల్ లో కొత్తగా కనిపించి ఫిదా చేసాడు నాగ్. సోలొమన్ టేకింగ్ రిచ్ గా ఉందన్న కాంప్లిమెంట్స్ వైల్డ్ డాగ్ మూవీని ఇంకాస్త బలంగా నిలబెట్టింది. ఫిమేల్ లీడ్ లో దియా మీర్జా నటిస్తే.. సయామీ ఖేర్, అతుల్ కుల్ కర్ణి కీలకపాత్రల్లో కనిపించారు. ఇక ఇప్పుడు ప్రవీణ్ సత్తారు తో ఓ సినిమా చేస్తున్నాడు కింగ్.
యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను ‘గోవా’లో పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేస్తున్నారు. జూన్ మొదటివారం నుంచి ఈ సెట్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున జోడీగా కాజల్ కనిపించనుంది. ‘గరుడ వేగ’ వంటి భారీ హిట్ తరువాత ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న సినిమా అవవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
మరిన్ని ఇక్కడ చదవండి :