నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం తారక్ నటించబోయే NTR30 ప్రాజెక్ట్ ఇటీవల పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. భయం అంటే తెలియని మృగాళ్లతో తారక్ వేటాడే బ్యాక్ డ్రాప్ ఈ చిత్రమని ఇటీవల కొరటాల చెప్పడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రంలో తారక్ ను పక్కా మాస్ అవతార్ లో యాక్షన్ మోడ్ లో చూపించడానికి రెడీ అయ్యారు కొరటాల. ఈ సినిమా కోసం మేకర్స్ భారీ సెట్ వేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దించుతున్నారు.
ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్ ను రంగంలోకి దించారు మేకర్స్. హాలీవుడ్ యాక్షన్ ప్రొడ్యూసర్ కెన్నీ బేట్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. డైరెక్టర్ కొరటాలతో కెన్నీ బేట్స్ సీన్ డిస్కస్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. అతడికి స్వాగతం పలికింది చిత్రయూనిట్. కెన్నీ బేట్స్ గతంలో ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు. తాజాగా విడుదల చేసిన ఫోటోను చూస్తుంటే.. పెద్ద షిప్ లో ఫైట్ తీయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్30లో మేజర్ యాక్షన్ పార్ట్ అంతటినీ కెన్నీ బేట్స్ కంపోజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఏప్రిల్ లో స్టార్ట్ కానుంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని తెరకెక్కిస్తున్నా్రు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు..
Renowned Action Producer #KennyBates joins the team of #NTR30 & is choreographing major action sequences ?
Conceptualization in progess!@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @sabucyril @RathnaveluDop @YuvasudhaArts pic.twitter.com/IfvrNB9v2a
— NTR Arts (@NTRArtsOfficial) March 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.