ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుతోంది. దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది ఈ కుంభమేళాకు తరలివస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్య ప్రజలతోపాటు సాధువులు, విదేశీ పర్యటకులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగమవుతున్నారు. కాగా మహా కుంభమేళాలో ఓ ప్రముఖ నటి సన్యాసిగా మారడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె ఎవరో కాదు ఒకప్పుడు తన అంద చందాలతో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన మమతా కులకర్ణి. చాలా సంవత్సరాల క్రితమే భారతదేశాన్ని విడిచిపెట్టిన ఆమె ఇప్పుడు ఆధ్యాత్మికత మార్గంలో నడిచింది. కొద్ది రోజుల క్రితం ఇండియాకు వచ్చిన ఆమె వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆమె మహాకుంభానికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచే పని చేసింది. కిన్నార్ అఖారా మహామండలేశ్వరిగా మమతా కులకర్ణి నియామకం కావడంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. చాలా మంది ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.ఇప్పుడు ఈ వ్యవహారంపై ట్రాన్స్‌జెండర్, జగద్గురు మహామండలేశ్వర్ హిమాంగి సఖి ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతను మహామండలేశ్వరిగా ప్రకటించడాన్ని తప్పుపట్టారు.
‘పబ్లిసిటీ కోసమే మమత కిన్నర్ అఖారాకు వచ్చారు. ఆమె గతం గురించి సమాజానికి బాగా తెలుసు. డ్రగ్స్ కేసులో జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె అకస్మాత్తుగా భారతదేశానికి వచ్చి, మహాకుంభంలో పాల్గొని, మహామండలేశ్వరుని పదవిని పొందింది. ఇది సరైనది కాదు. దీనిపై విచారణ జరపాలి. సనాతన ధర్మాన్ని పాటించకుండా మమతకు మహామండలేశ్వర్ పదవిని ఇవ్వడమనేది నైతికతకు సంబంధించిన ప్రశ్న. అర్హత లేని వారిని అందలమెక్కిస్తున్నారు’ అని హిమాంగి సఖి మా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పబ్లిసిటీ కోసమే ఇదంతా..
#WATCH | #MahaKumbhMela2025 | Kinnar Mahamandaleshwar Hemangi Sakhi Maa says, “First of all, who was Kinnar Akhada formed for? For the Kinnar community. But now, a woman has been inducted into the Kinnar Akhada. If it is Kinnar Akhada and you have started giving positions to… pic.twitter.com/qsZl09xSZG
— ANI (@ANI) January 25, 2025
మమతా కులకర్ణి 1990లలో ‘కరణ్ అర్జున్’, ‘బాజీ’ వంటి హిట్ చిత్రాలలో నటించింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో తెరను పంచుకుంది. తెలుగులోనూ ప్రేమ శిఖరం, దొంగ వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే 2000లో మమత బాలీవుడ్‌కి దూరమై భారత్‌ని వదిలి విదేశాల్లో స్థిరపడింది. అయితే ఇప్పుడు మహాకుంభంలో జరిగిన ఈ ఘటనతో ఆమె మరోసారి వెలుగులోకి వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి