Sridevi: అన్యాయంగా నన్ను అన్నిమాటలు అన్నాడు.. జక్కన్న పై అసహనం వ్యక్తం చేసిన అతిలోక సుందరి.. ఆసమయంలో

కేవలం అందంతోనే కాదు నటనలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో 300లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ్ భాషలతో పాటు హిందీలోనూ నటించి అలరించింది శ్రీదేవి

Sridevi: అన్యాయంగా నన్ను అన్నిమాటలు అన్నాడు.. జక్కన్న పై అసహనం వ్యక్తం చేసిన అతిలోక సుందరి.. ఆసమయంలో
Rajamouli, Sridevi

Updated on: Jan 09, 2023 | 8:13 AM

సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు శ్రీదేవి. అందం కూడా అసూయా పడేలా.. దేవకన్యలు కూడా కుళ్ళుకునేలా ఉంటారు శ్రీదేవి. కేవలం అందంతోనే కాదు నటనలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో 300లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ్ భాషలతో పాటు హిందీలోనూ నటించి అలరించింది శ్రీదేవి. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. ఇక బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్ ను పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా శ్రీదేవి దుబాయ్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఇదిలా ఉంటే శ్రీదేవి గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామిగా ముందుగా శ్రీదేవిని అనుకున్నారు. అయితే ఆమె స్థానంలో రమ్యకృష్ణను తీసుకున్నారు. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. శ్రీదేవి సినిమాకు 10కోట్ల వరకు డిమాండ్ చేస్తారని.. అలాగే ఆమెకు ఆమె అసిటెంట్స్ కు 5 స్టార్ హోటల్ సదుపాయాలు కల్పించాలి. అలాగే ఆమె రావడానికి పోవడానికి ఫైట్ టికెట్స్ వేయాలి.. అంత బడ్జెట్ తమకు వర్కౌట్ కాదని అన్నారు జక్కన్న.

ఇవి కూడా చదవండి

అయితే ఈ వ్యాఖ్యలపై అప్పట్లో శ్రీ దేవి కూడా స్పందించారు.. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు బాధపెట్టాయని అన్నారు. నేను ఎలా డిమాండ్ చేసేదానిని అయితే ఇన్నేళ్లు హీరోయిన్ గా రాణించేదాన్ని కాదు. నాతో పెద్ద పెద్ద దర్శకులు అంతా చాలా సినిమాలు చేశారు. నేను భారీగా డిమాండ్ చేస్తే వారు నన్ను రిపీట్ చేశేవారు కాదు. అన్నారు శ్రీదేవి. రాజమౌళి తెరకెక్కించిన ఈగా సినిమా నాకు చాలా ఇష్టం.. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన రాజమౌళి ఇలా నాపై వ్యాఖ్యలు చేయడం బాధగా ఉందని అన్నారు శ్రీదేవి.