AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South India Actress: ఈమెని గుర్తించారా.. ఇప్పుడు సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్.. వామ్మో ఎంత మార్పు..?

పిల్లలు టీనేజ్‌ వయసుకు వచ్చాక శారీరకంగా, మానసికంగా కూడా చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఎత్తు పెరగడం కూడా ఎక్కువగా టీనేజ్‌లోనే జరుగుతోంది. కొందరికి...

South India Actress: ఈమెని గుర్తించారా.. ఇప్పుడు సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్.. వామ్మో ఎంత మార్పు..?
Heroine
Ram Naramaneni
|

Updated on: Aug 29, 2021 | 6:20 PM

Share

పిల్లలు టీనేజ్‌ వయసుకు వచ్చాక శారీరకంగా, మానసికంగా కూడా చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఎత్తు పెరగడం కూడా ఎక్కువగా టీనేజ్‌లోనే జరుగుతోంది. కొందరికి ఊహించని విధంగా ఫేస్ కట్స్ కూడా మారిపోతుంటాయి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చూసి.. యంగ్ ఏజ్ వచ్చాక గుర్తు పట్టకుండా ఉండేవాళ్లు చాలామంది ఉంటారు. సినిమా తారలు విషయంలో అయితే ఈ మార్పులు చాలా ఉంటాయి. వెండితెరపై అందంగా కనిపించేందుకు వాళ్ల మేకోవర్ మాములుగా ఉండదు. ఓ రేంజ్‌లో వర్కువుట్స్ చేస్తారు. కొంతమంది అయితే కాస్మోటిక్ సర్జరీలు వైపు మొగ్గు చూపుతారు. అందాల తార శ్రీదేవి దగ్గర్నుంచి నేటి తరంలో చాలామంది నటులు, నటీమణులు ఇలా సర్జరీల ద్వారానే శరీరాకృతులు మార్చుకున్నారనే టాక్ ఉంది. ఈ విషయం బయటకు చెప్పడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అయితే ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ మాత్రం ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేశారు. ‘నా ముక్కుకు సమస్య ఉండటంతో సర్జరీ చేసుకున్నాను.. అయితే మీకేంటి?’ అని ట్రోలర్లను వాయించేశారు.

తన శరీరంలో తనకు తన ముక్కు అంటేనే ఇష్టమని కూడా శృతి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే తన పాత ఫోటోలు షేర్ చేయడానికి కూడా శృతి ఏ మాత్రం ఇబ్బంది పడరు.  ఎప్పుడూ కూడా తన పాత రూపాన్ని కించపరుచుకోలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా తన పాత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె పదిహేడేళ్ల వయసులో చేసిన ఫోటో షూట్ గురించి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఆ సమయంలో తాను ఎలా ఉన్నానో చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఫోటోలో శృతి హాసన్‌ను గుర్తు పట్టడం చాలా కష్టమైన టాస్కే అని చెప్పాలి. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు అప్పట్లో ఈ బ్యూటీ ఇలా ఉండేదా? అని కామెంట్లు పెడుతున్నారు. ఆ ఫోటోపై మీరు ఓలుక్కేయండి.

Also Read: పంజ్‌షీర్ తమకు చిక్కిందంటున్న తాలిబన్లు.. అడుగుపెడితే శరీరాలు ఛిద్రమే అంటున్న నార్తర్న్‌ అలయెన్స్‌

షాకింగ్.. మహిళను పొడిచిన బర్రె… కొమ్ములపైన శవంతో రాత్రంతా తిరుగుతూ..