
Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హాట్ బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భాగ్నాని (Jackky Bhagnani) ప్రేమిస్తున్నట్లు తామిద్దరం రిలేషన్ షిప్ లో ఉన్నట్లు గత ఏడాది సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ జంట అనేక మంది దృష్టిని ఆకర్షిస్తోంది. వీరిద్దరికీ సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపిస్తున్నారు. తాజాగా రకుల్ (Rakul Preeti Singh)తనకు జాకీ పుట్టిన రోజు కి అందమైన కానుకగా ఓ కవితను రాసి ఇచ్చినట్లు అభిమానులతో పంచుకుంది. అంతేకాదు తమ మధ్య ఉన్న సంబంధం దాచడానికి లేదా మోసగించడానికి ఏమీ లేదని ఈ పంజాబీ సుందరి తెలిపింది. ఎవరైనా రిలేషన్‌షిప్‌లో ఉంటే దానిని గుర్తించడం , గౌరవించడం చాలా ముఖ్యం అని రకుల్ చెప్పింది. తనకు జాకీ ( ఇద్దరిదీ ఒకటే ఆలోచన అని కూడా ఆమె చెప్పింది. ఎవరైనా తమ సంబంధం గురించి ఎవరికీ తెలియకూడదని దాచిపెడుతూ ఉంటారు. కానీ తమిద్దరికీ అటువంటి ఆలోచన లేదని తెలిపింది. తమ ఇద్దరి గురించి ఇంట్లో కూడా తెలుసు అని.. మా ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు, ఆలోచనలు ఒకటే అని రకుల్ చెప్పింది. అంతేకాదు జాకీ మంచి హాస్య చతురత కలిసిన వ్యక్తీ అంటూ ప్రశంసించింది.
మేమిద్దరం ఒకరికొకరం గౌరవం ఇచ్చిపుచ్చుకుంటాం.. మా రిలేషన్ అందంగా సాగుతుంది అంటూ జాకీ పై తనకు ఉన్న ప్రేమని, అభిమానాన్ని, తన రిలేషన్ షిప్ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది రకుల్ ప్రీత్ సింగ్.
అయితే జాకీతో తన సంబంధం పబ్లిక్‌గా ఉన్నప్పటికీ తమపై అందరూ దృష్టి పెట్టాలని తాను కోరుకోవడం లేదని చెప్పింది. రిలేషన్ షిప్ అనేది తన జీవితంలో ఒక భాగమని .. నా జీవితంలో జాకీతో పరిచయం, ప్రేమ అద్భుతం అని తెలిపింది రకుల్. మా ప్రేమ గురించి మా ఇద్దరి ఫ్యామిలీ మెంబర్స్ , ఫ్రెండ్స్ కీ తెలుసు. ఆహారపు అలవాట్లు కూడా ఒకేలా ఉంటాయి. అయితే ఇప్పట్లో తాము పెళ్లి చేసుకోమని.. ప్రస్తుతం తాను సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలిపింది. అయితే తమ పెళ్లి అందరికీ చెప్పి చేసుకుంటామని రకుల్ తెలిపింది. ప్రస్తుతం రకుల్ .. థాంక్స్ గాడ్, రన్‌వే 34 , ఛత్రివాలి వంటి పలు బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
Also Read: ఆ దేశంలో రిలాక్స్ కోసం వంటిపై నూలు పోగులేకుండా.. కొండచిలువలతో మసాజ్