
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా రాజా సాబ్ సినిమా థియేటర్స్ సందడి చేస్తుంది. ప్రభాస్ వింటేజ్ లుక్ తో అదరగొట్టాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ సొంతం చేసుకుంటుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది. కాగా రాను రాను ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. కాగా మారుతి చెప్పినంత ఈ సినిమా లేదు అంటూ ప్రభాస్ అభిమానులు కొందరు మండిపడుతున్నారు. అసలు ప్రభాస్ సినిమాలానే లేదు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమా నిరాశపరిచిందని కొందరు అభిమానులు దర్శకుడు మారుతి సీరియస్ అవుతున్నారు. ఇంటి అడ్రస్ ఇచ్చి కూడా మారుతి ఇలాంటి సినిమా చేశాడేంటీ అంటూ మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే రాజా సాబ్ సినిమా కోసం ఓ హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ రాలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆర్ఎక్స్ 100తో అందరి మనసు దోచేసిన పాయల్ రాజ్ పుత్. వరుసగా సినిమాలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఓ వీడియోను షేర్ చేసింది.
ఈ వీడియోలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది. ఈవీడియోను షేర్ చేస్తూ.. రాజా సాబ్ సినిమాలో ఎంపిక కానప్పుడు అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజా సాబ్ సినిమా తొలి రోజే కలెక్షన్స్ అదరగొడుతుంది. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.45 కోట్లకు పైగా వసూల్లు రాబట్టినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రాజా సాబ్ సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.