Nithya Menen: పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నిత్యామీనన్.. ఏమన్నదంటే

|

Oct 20, 2023 | 4:57 PM

తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది నిత్యా. నాని నటించిన అలామొదలైంది సినిమాతో నిత్యామీనన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత ఈ చిన్నది వరుస సినిమాలతో దూసుకుపోయింది. తక్కువ సమయంలో క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. తెలుగులో చాలా మంది హీరోల సరసన నటించింది నిత్యా. అలాగే తమిళ్ లో దళపతి విజయ్, సూర్య, ధనుష్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

Nithya Menen: పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నిత్యామీనన్.. ఏమన్నదంటే
Nithya Menon
Follow us on

అందం అభినయంతో పాటు టాలెంటెడ్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ నిత్యామీనన్. నిత్యా మీనన్ కు సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది నిత్యా. నాని నటించిన అలామొదలైంది సినిమాతో నిత్యామీనన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత ఈ చిన్నది వరుస సినిమాలతో దూసుకుపోయింది. తక్కువ సమయంలో క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. తెలుగులో చాలా మంది హీరోల సరసన నటించింది నిత్యా. అలాగే తమిళ్ లో దళపతి విజయ్, సూర్య, ధనుష్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్, మలయాళంతో సహా అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలదు నిత్యా. తాజాగా నిత్యా మీనన్ తన పెళ్లి ప్లాన్ గురించి మాట్లాడింది.

హీరోయిన్స్ పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే నిత్యామీనన్ పెళ్లి గురించి  కూడా ఇప్పటికే చాలా రూమర్స్ చక్కర్లు కొట్టాయి. తాజాగా తన పెళ్లి గురించి స్పందించింది నిత్యా మీనన్. ప్రస్తుతానికి  పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని తేల్చి చెప్పేసింది ఈ బబ్లీ బ్యూటీ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ తన పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. . ‘నేను మంచి స్థాయికి ఎదిగాను. నేను ఏమి చేయాలో మరెవరూ చెప్పాలని నేను అనుకోను. నా పెళ్లి విషయంలో విషయంలో నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకున్నారు. వారు నాకు స్వేచ్ఛ ఇచ్చారు. నేను స్వేచ్ఛ లేకుండా జీవించలేను. అది వాళ్లకు తెలుసు’ అని తెలిపింది నిత్యా. అలాగే నిత్యా మాట్లాడుతూ.. ‘మా అమ్మమ్మ బతికి ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేది.. పాపులర్ నటినైన నన్ను ఆమె పెళ్లి గచేసుకోమని గోల చేసేది. ‘నువ్వేమి చేస్తున్నావు.? నువ్వు పెళ్లి చేసుకోకూడదా అని అమ్మమ్మ నన్ను అడుగుతూనే ఉండేది. ఆమె ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఆమె తప్ప మరెవరూ ఈ విషయంలో పెద్దగా పట్టించుకోలేదు’ అని నిత్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిత్యా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది.

నిత్యామీనన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి