
సినీ ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. ప్రేమలు, బ్రేకప్స్, పెళ్లిళ్లు, విడాకులు ఇక్కడ చాలా కామన్..ఇప్పటికే చాలా మంది పెళ్లి పీటలెక్కి సంతోషంగా ఉంటే కొంతమంది విడాకులు తీసుకొని ఇంకా హ్యాపీగాగడిపేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ టైప్ వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. డబ్బులు ఎక్కువ వస్తే తన భర్త తనను అమ్మేయాలని చూశాడని తెలిపి షాక్ ఇచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్. ఈ అమ్మడు ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. అంతే కాదు ఈ అమ్మడు కరీనా కపూర్ సిస్టర్.
కరిష్మా కపూర్ , అభిషేక్ బచ్చన్ ప్రేమించుకున్నారు. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్.. రాణీముఖర్జీతో ప్రేమాయణం నడిపాడు. కానీ అది కూడా కుదరలేదు. ఫైనల్ గా ఐశ్వర్యారాయ్ ను పెళ్లాడాడు అభిషేక్. ఆతర్వాత కరిష్మా కపూర్..ఢిల్లీకి చెందిన బిజినెస్ మ్యాన్ సంజయ్‌ను పెళ్లాడింది. వీరి వివాహం 2003లో జరిగింది.
ఈ ఇద్దరూ 2014లో విడాకులకు తీసుకున్నారు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2014లో విడాకులకు అప్లై చేశారు 2016లో విడాకులు మంజూరు అయ్యాయి. అప్పటి నుంచి కరిష్మా సోలోగానే ఉంటుంది. తాజాగా కరిష్మా వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలకు సంబందించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కరిష్మా గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హనీమూన్ కు వెళ్లిన సయమంలో తనను తన భర్త స్నేహితులతో రాత్రంతా గడపాలని ఒత్తిడి చేశాడని తెలిపింది. అంతే కాదు వేలానికి పెట్టి తనను అమ్మేయాలని చూశాడని ఆవేదన వ్యక్తం చేసింది కరిష్మా కపూర్. అంతే కాదు తన తల్లితో కలిసి భర్త తనను కొట్టించాలని చూశారని తెలిపింది కరిష్మా ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.