Anupama Parameswaran: అనుపమకు ఇష్టమైన హీరోయిన్ ఆమెనట.. ఎంతో అందంగా ఉంటుందంటూ..

తక్కువ సమయంలోనే అనుపమకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈ చిన్నది చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యూత్ లో అనుపమకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మొన్నటి వరకు గ్లామర్ పాత్రలను నో చెప్పిన అనుపమ ఇప్పుడు గ్లామర్ కు గేట్లు ఎత్తేసింది. ఇటీవలే డీజే టిల్లు  సినిమాకు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Anupama Parameswaran: అనుపమకు ఇష్టమైన హీరోయిన్ ఆమెనట.. ఎంతో అందంగా ఉంటుందంటూ..
Anupama

Updated on: Mar 09, 2024 | 12:48 PM

కుర్రాళ్లను తన చూపుతో.. కట్టిపడేయడం.. అందంతో ఆకట్టుకోవడం అనుపమ పరమేశ్వరన్ కు వెన్నతో పెట్టిన విద్య. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అ,ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. తక్కువ సమయంలోనే అనుపమకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈ చిన్నది చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యూత్ లో అనుపమకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మొన్నటి వరకు గ్లామర్ పాత్రలను నో చెప్పిన అనుపమ ఇప్పుడు గ్లామర్ కు గేట్లు ఎత్తేసింది. ఇటీవలే డీజే టిల్లు  సినిమాకు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో తన అందాలతో అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లో తన గ్లామర్ తో కట్టిపడేసింది.

ఇక ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ తో షాక్ ఇచ్చింది అనుపమ. ఇప్పుడు మరోసారి టిల్లు స్క్వేర్ లో లిప్ లాక్ తో పాటు స్కిన్ షోతో ఆకట్టుకుంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ్ భాషల్లోనూ నటిస్తుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే అనుపమ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఈ క్రమంలో ఆమె తన ఫెవరెట్ హీరోయిన్ గురించి తెలిపింది. తనకు సాయి పల్లవి అంటే ఇష్టమని.. ఆమె నటన తనకు నచ్చుతుందని తెలిపింది అనుపమ. అలాగే సాయి పల్లవి చాలా అందంగా ఉంటుందని, అలాగే నేచురల్ బ్యూటీ అని తెలిపింది అనుపమ. సాయి పల్లవికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అనుపమ కూడా తనకు సాయి పల్లవి అంటే ఇష్టం అని తెలిపింది. ఇక ప్రేమమ్ సినిమాతోనే ఈ ఇద్దరు ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరు భామలు టాలీవుడ్ లోనూ రాణిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.