Actor Vishnu Vishal: కోలీవుడ్‌లోనూ కరోనా కలకలం.. హీరో విష్ణు విశాల్‌కు పాజిటివ్..

కరోనా మరోసారి భయపెడుతుంది.. సెకండ్ వేవ్ గ్యాప్ ఇచ్చిన కరోనా ఇప్పుడు మరోసారి కోరలు చాస్తోంది.. క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు బందోళనకు గురవుతున్నారు.

Actor Vishnu Vishal: కోలీవుడ్‌లోనూ కరోనా కలకలం.. హీరో విష్ణు విశాల్‌కు పాజిటివ్..
Vishnu Vishal

Updated on: Jan 10, 2022 | 5:30 PM

Vishnu Vishal: కరోనా మరోసారి భయపెడుతుంది.. సెకండ్ వేవ్ గ్యాప్ ఇచ్చిన కరోనా ఇప్పుడు మరోసారి కోరలు చాస్తోంది.. క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు బందోళనకు గురవుతున్నారు. సామాన్యులనుంచి సెలబ్రెటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. సినిమా తారలకు కరోనా సోకడంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు.  ఇప్పటికే.. బీటౌన్‌లో ఏక్తా కపూర్, అర్జున్‌ కపూర్‌, స్వరా భాస్కర్‌, సింగర్ విశాల్ డడ్లానీతో పాటు టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు, మనోజ్ , తమన్ , త్రిష, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ ఇలా అందరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తమిళ నటుడు , నిర్మాత విష్ణు విశాల్ కరోనా బారిన పడ్డారు.

తాను కరోనా బారిన పడిన విషయాన్నీ ఆయనే స్వయంగా తెలిపారు. ఈ మేరకు విష్ణు విశాల్ ట్వీట్ చేశారు. నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొద్దిర్ రోజులుగా నన్ను కలిసిన వారంతా కరోనా టెస్ట్ లు చేయించుకోవాలి అని కోరాడు. వాళ్ళు నొప్పులు, జలుబు, లైట్ గా జ్వరం ఉందని.. తొందరలోనే కోలుకుంటా అని చెప్పుకొచ్చాడు విష్ణు విశాల్. అయితే రెండు రోజుల క్రితం రవితేజ తో కలిసి సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు విశాల్. ఆయన తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. దాంతో రవితేజ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. రవితేజ అభిమాని దీనిగురించి ప్రశ్నించగా ఆ ఫోటో పాతది అని క్లారిటీ ఇచ్చాడు విష్ణు విశాల్. దాంతో మాస్ రాజా ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్నిఇక్కడ చదవండి : 

Jr.NTR: ఎన్టీఆర్ న్యూలుక్ అదుర్స్.. స్మార్ట్ లుక్‏లోకి మారిన తారక్..

Ramesh Babu: రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి.. మహేష్ బాబు లేని లోటును తీర్చిన నమ్రత..

Anupama Parameswaran: క్యూట్ క్యూట్ గా ఎట్రాక్ట్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోస్…