దయచేసి ఆపేయండి.. మీ కాళ్లు పట్టుకుంటా.. విశాల్ ఎమోషనల్ పోస్ట్

తమిళ్ స్టార్ హీరో విశాల్‏కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి విజయాన్ని అందుకున్నాయి. సహజమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా.. సౌత్ ఇండస్ట్రీ నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

దయచేసి ఆపేయండి.. మీ కాళ్లు పట్టుకుంటా.. విశాల్ ఎమోషనల్ పోస్ట్
Vishal

Updated on: Nov 08, 2025 | 3:10 PM

యాక్షన్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. తమిళ్ లో స్టార్ హీరో అయిన విశాల్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు మన దగ్గర కూడా విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. విశాల్ ఫైట్లు ఫ్లాప్స్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఏడాది రెండు, మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. అయితే విశాల్ కు హిట్ పడి చాలా కాలం అయ్యింది. సహజమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా.. సౌత్ ఇండస్ట్రీ నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అయితే ఈ మధ్య విశాల్ పేరు వార్తల్లో తెగ వినిపిస్తుంది.

తాజాగా విశాల్ సోషల్  మీడియాలో ఓ ట్వీట్ చేశారు. కొయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.. దాంతో రాష్ట్రం మొత్తం అవాక్ అయ్యింది. ఓ కాలేజీ స్టూడెంట్ తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తుండగా.. కోయంబత్తూరు ఎయిర్‌పోర్టు సమీపంలో వారి కారు ఆగిపోయింది..అప్పుడే కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను లైంగికంగా వేధించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు.

దీని పై పలువురు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. యువతి పై జరిగిన అత్యాచార ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఓ యువతి బయట తిరగడాన్ని ఎమ్మెల్యే ఈశ్వరన్‌ తప్పుబడుతూ చేసిన కామెంట్స్‌.. సంచలనంగా మారాయి. దీనిపై విశాల్ కూడా స్పందించారు. “ఆ సమయంలో బాధితురాలు ఆ ప్రదేశంలో ఉన్నందుకు ఆమెను నిందించడం ఆపండి. మన దేశంలో పునరావృతమయ్యే ఈ అత్యాచారం అనే అంశాన్ని రాజకీయం చేయడం ఆపండి. కనీసం ఇప్పుడైనా నేను వేడుకుంటున్నాను, మీ కాళ్ళపై పడి నమస్కరిస్తున్నాను. ఈ దారుణమైన నేరానికి దయచేసి మరణశిక్ష విధించండి. నిర్భయ సంఘటన జరగడం మనం చూశాం. 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, తన సొంత తల్లిని హత్య చేసిన ఆరోపణలపై సుదీర్ఘ విచారణ తర్వాత గత నెలలో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేయడం మనం చూశాం. సౌదీ అరేబియాలో ఇది జరుగుతుందా..? కొన్ని సంవత్సరాల క్రితం APలో ఇటువంటి నేరం జరిగినప్పుడు చర్య తీసుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి YSR కి నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు అలాంటి సమయం వచ్చింది”. అంటూ విశాల్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి