AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Girlfriend: ఒక్కో యాంగిల్ లో ఒక్కోలా...హిట్టా.? ఫట్టా..?

The Girlfriend: ఒక్కో యాంగిల్ లో ఒక్కోలా…హిట్టా.? ఫట్టా..?

Phani CH
|

Updated on: Nov 08, 2025 | 2:55 PM

Share

రాహుల్ రవీంద్రన్‌ దర్శకత్వంలో, రష్మిక, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ది గర్ల్‌ఫ్రెండ్‌' చిత్రం ఒక ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ. రొటీన్ కథాంశం అయినప్పటికీ, దర్శకుడు తన విజువల్ ట్రీట్‌మెంట్‌తో కొత్తదనాన్ని అందించే ప్రయత్నం చేశారు. నియంత్రిత ప్రేమ సంబంధం నుండి విముక్తి, స్వీయ నిర్ణయాల ప్రాముఖ్యతను ఈ సినిమా వివరిస్తుంది. మరి రాహుల్ రవీంద్రన్‌కి ఇది బిగ్ హిట్‌ అందించిందా?

నేషనల్‌ క్రష్‌ రష్మిక.. దసరా ఫేం దీక్షిత్‌ శెట్టి కీ రోల్స్‌లో యాక్ట్ చేసిన సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్టర్‌. గీతా ఆర్ట్స్‌ బ్యానర్లో .. ఇంటెన్స్‌ అండ్ ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది? రాహుల్ రవీంద్రన్‌కు డైరెక్టర్‌గా బిగ్ హిట్ ఇచ్చిందా? లేదా? అనేది ఈ రివ్యూలో చూద్దాం. ఇక ది గర్ల్ ఫ్రెండ్ కథలోకి వెళితే.. భూమా అలియాస్ రష్మిక.. తన తండ్రి అలియాస్ రావు రమేశ్‌ చాటున పెరిగిన ఓ అమాయకపు అమ్మాయి. అయితే MA లిటరేచర్‌ చదవడం కోసం ఈమె తొలిసారి తన తండ్రిని వదిలి సిటీకి షిప్ట్ అవుతుంది. అక్కడ రామలింగయ్య ఆర్ట్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో జాయిన్‌ అవుతుంది. విక్రమ్‌ అలియాస్ దీక్షిత్‌ శెట్టి, దుర్గ అలియాస్ అను ఇమ్మాన్యుయేల్‌ కూడా అదే కాలేజీలో చేరతారు. ఇక విక్రమ్‌ కాలేజీలో ఆవేశపరుడు. అంతేకాదు అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలనుకునే స్వభావం కలవాడు. ఎగ్జాక్ట్‌గా తనకు నచ్చినట్లుగా భూమా అలియాస్ రష్మిక ప్రవర్తన ఉండడంతో ఆమెను ప్రేమిస్తాడు. మరోవైపు అదే కాలేజీకి చెందిన మరో అమ్మాయి దుర్గ అలియాస్ అనూ ఇమ్మాన్యుయేల్‌..విక్రమ్‌ని ఇష్టపడుతుంది. కానీ విక్రమ్‌ మాత్రం ఆమెను నిరాకరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే లవ్‌, రిలేషన్‌కు దూరంగా ఉండాలనుకున్నప్పటికీ…. భూమా కూడా విక్రమ్‌తో ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత భూమా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? తన లైఫ్‌ మొత్తం విక్రమ్‌ కంట్రోల్‌లోకి వెళ్లిందని తెలిసిన తర్వాత భూమా తీసుకున్న అనూహ్య నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం ఆమెకు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టింది? వాటిని అధిగమించి ఎలా సక్సెస్‌ అయిందనేదే మిగతా కథ. అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలి.. ఇలాంటి పనులే చేయాలని చెప్పే మగమహారాజులు చాలా మందే ఉన్నారు. బయట నీతులు మాట్లాడి..ఇంట్లో ఆడవాళ్లకు కనీస గౌరవమర్యాదలు ఇవ్వని భర్తలు.. ప్రేమ పేరుతో వారి జీవితాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకొని.. మాటలతో హింసించే బాయ్‌ప్రెండ్స్‌.. వీరిందరూ ఇప్పటీకీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు. అలాంటి లక్షణాలన్నీ ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌ దగ్గర నుంచి తన లక్ష్మాన్ని రష్మిక ఎలా చేరుకుందనేదే సినిమా. మనల్ని కంట్రోల్‌ చేసే పవర్‌ని ఇతరులకు ఇవ్వొద్దని, కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలే తీసుకోవాలి అని చెప్పే సినిమా ఇది. ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమాను కథగా చూస్తే.. ఇది చాలా సింపుల్‌ అండ్‌ రొటీన్‌ స్టోరీ. కానీ డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ దాన్ని తెరపై చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. విజువల్స్‌ ద్వారానే తను చెప్పాలనుకున్న పాయింట్‌ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్‌ ముందు వచ్చే రష్మిక షవర్‌ సీన్‌, హీరో అమ్మతో మాట్లాడుతున్న సమయంలో తీసిన మిరర్‌ విజువల్‌, బ్రేకప్‌ తర్వాత హీరో గ్యాంగ్‌ వెంబడించినప్పుడు వచ్చే సింబాలిక్‌ షాట్స్‌.. ఇవన్నీ రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వ ప్రతిభను చాటిచెబుతాయి. అయితే ఇదంతా ఒకవైపే.. ఇక మరో వైపు లాజిక్స్‌ను.. ప్రస్తుతం సమాజంలోని పరిస్థితులను పరిగణలోకి తీసుకుని చూస్తే.. ఈ సినిమా కథ పాత చింతకాయ పచ్చడిలాగే అనిపిస్తుంది. ఏ వర్గం ప్రేక్షకుడైనా ఈ సినిమాలోని హీరో లేదా హీరోయిన్‌ పాత్రతో కనెక్ట్‌ అవ్వడం ఖాయం. ఇద్దరి పాత్రలూ.. మనం ఎక్కడో చూసినట్లుగా, విన్నట్లుగానే ప్రవర్తిస్తాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. అమ్మాయి కోణంలో..అబ్బాయి కోణంలో… తల్లిదండ్రుల కోణంలో.. ఇలా ఒక్కో యాంగిల్ లో ఒక్కోలా వుంటుంది సినిమా.. ఫస్టాఫ్‌ మొత్తం హీరోహీరోయిన్ల ప్రేమ చుట్టూ తిరిగితే.. సెకండాఫ్‌ మాత్రం ప్రేమలో పడిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే చూపించారు. ఊహకందేలా కథనం సాగినా..తెరపై ఆయా సన్నివేశాలను చూస్తుంటే..కొన్ని చోట్ల ఎమోషనల్‌ అవుతాం. క్లైమాక్స్‌లో హీరోయిన్‌ చెప్పే మాటలు ప్రతి ఒక్కరినీ, ముఖ్యంగా నేటి తరం యువకులను ఆలోచింపజేస్తాయి. సున్నితమైన సంగీతం..సునిశితమైన చిత్రీకరణ.. చాలా రోజుల తరువాత బోలెడు సింబాలిక్ షాట్ లు.. మొత్తానికి ఇలా సాగుతుంది ది గర్ల్‌ ఫ్రెండ్ మూవీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: సన్నగా కాదు.. సైలెంట్‌గా దిగే బాకు

Jatadhara: కథగా ఓకే కానీ.. హిట్టా..? ఫట్టా..?

Bigg Boss Telugu 9: తారుమారైన ఓటింగ్.. ఊహించని కంటెస్టెంట్‌ డేంజర్‌ జోన్‌లో

ChatGPT: ఇండియాలో చాట్​‌ జీపీటీ.. ఫ్రీ ఫ్రీ ఫ్రీ

ఒకే వ్యక్తిని ఒకే నెలలో 7 సార్లు కాటేసిన పాము