Jatadhara: కథగా ఓకే కానీ.. హిట్టా..? ఫట్టా..?
సిల్వర్ స్క్రీన్ పై ఏదో కొత్తగా ఆవిష్కరించాలనే తపన చాలా ఎక్కువగా ఉన్న హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఈ మధ్య వర్సటైల్ కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈ హీరో ఇప్పుడు జాటాధర సినిమాతో మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.. జటాధర కథలోకి వెళితే.. శివ అలియాస్ సుధీర్ బాబు దెయ్యాలు ఉన్నాయని నమ్మని ఓ ఘోస్ట్ హంటర్.
సైన్స్‌ని మాత్రమే నమ్ముతూ.. దెయ్యాలు ఉన్నాయని ప్రచారం జరిగిన చోటికి వెళ్లి రీసెర్చ్ చేస్తుంటాడు. అతని తల్లిదండ్రులు ఝాన్సీ, రాజీవ్ కనకాలకు ఈ విషయం తెలియదు. ఓ రోజు ప్రముఖ ఘోస్ట్ హంటర్ మణిశర్మ అలియాస్ అవసరాల శ్రీనివాస్ అసిస్టెంట్ అంకిత్ అనుమానాస్పదంగా మరణించడంతో.. శివ రుద్రారం అనే గ్రామానికి వెళ్తాడు. ఈ విషయం అతని తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళన చెందుతారు. ఆ గ్రామానికి వెళ్లకూడదంటూ శివ గతం గురించి చెబుతారు. శివ గతం ఏంటి? రుద్రారం గ్రామానికి, అతనికి ఉన్న సంబంధం ఏంటి? ధన పిశాచి అలియాస్ సోనాక్షి సిన్హా ఆ గ్రామంలోనే ఎందుకు తిష్ట వేసింది? ధన పిశాచి వల్ల శివ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం ఏంటి? ఈ సినిమాలో శిల్పా శిరోద్కర్ పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. నిధుల కోసం తవ్వకాలు.. వాటికి రక్షణగా క్షుద్రశక్తులు ఉండడం.. దెయ్యాలు అంటే నమ్మని హీరో అనుకోకుండా అక్కడికి వెళ్లడం.. ఫ్లాష్‌బ్యాక్‌లో ఆ ప్రాంతంతో హీరోకి సంబంధం ఉందనే విషయం తెలియడం.. చివరకు దైవశక్తి సహాయంతో హీరో క్షుద్రశక్తులను అంతం చేయడం.. మైథలాజికల్ జానర్‌లో వచ్చే హారర్ చిత్రాల నేపథ్యం దాదాపు ఇలాగే ఉంటుంది. అయితే ప్రేక్షకులను ఎంత మేరకు థ్రిల్‌కి గురిచేశారనేదానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. కాస్త భయపెట్టి.. ప్లాష్‌బ్యాక్ స్టోరీని ఎమోషనల్‌గా తీర్చిదిద్దితే చాలు సినిమాని హిట్ అయిన దాఖలాలు ఉన్నాయి. జటాధర అలా మెప్పించిందా? జటాధర కథనాన్ని అయినా కాస్త ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం డైరెక్టర్ చేసుంటే బాగుండేదేమో అనిపించింది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు హైప్ ఇచ్చే సీన్స్ ఉంటే బాగుండేది. ఒకప్పుడు నిధులను ఎందుకు భూమిలో పాతిపెట్టేవారో వివరిస్తూ కథ మొదలవుతుంది. ఆ నిధులకు రక్షణగా బంధనం వేసేవారని.. అందులోనూ ధన పిశాచి బంధనం అతి భయంకరమైనదంటూ ఆసక్తికరంగా కథ ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే ఘోస్ట్ హంటర్‌గా హీరోని పరిచయం చేశాడు డైరెక్టర్. హీరో పరిచయంతో పాటే దెయ్యాలు లేవని ఎందుకు బలంగా నమ్ముతున్నాడో వివరిస్తూ ఓ ప్లాష్‌బ్యాక్ స్టోరీ చెప్పడం వరకు కథనం ఇంట్రెస్టింగానే అనిపిస్తుంది. ఘోస్ట్ హంటర్‌గా హీరో చేసే విన్యాసాలు సాగదీతగా అనిపిస్తాయి. మధ్యలో హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ నడుస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే హీరో.. సుధీర్ బాబు తన పాత్రకు న్యాయం చేసేందుకు చాలా ప్రయత్నం చేశారు. దివ్య ఖోస్లా పాత్ర నిడివి తక్కువే ఉన్నా.. నటన పరంగా పర్వాలేదు. నెగెటివ్ షేడ్ ఉన్న శోభ పాత్రలో శిల్పా శిరోద్కర్ ఒదిగిపోయింది. ధన పిశాచిగా సోనాక్షి సిన్హా.. లుక్‌పరంగా భయంకరంగా ఉన్నా.. ప్రేక్షకుడిని భయపెట్టే తీరు ఇంకా హైప్ చేయాల్సి ఉంది. ఆమె పాత్రకు గట్టిగా నవ్వడం.. అరవడం తప్ప సరైన డైలాగులు పడలేదు. రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రోహిత్ పాఠక్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం ఇంకా బాగుంటే సినిమాకు మరింతగా ప్లస్సయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్‌ఎక్స్ విభాగం పనితీరు ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Telugu 9: తారుమారైన ఓటింగ్.. ఊహించని కంటెస్టెంట్ డేంజర్ జోన్‌లో
ChatGPT: ఇండియాలో చాట్ జీపీటీ.. ఫ్రీ ఫ్రీ ఫ్రీ
ఒకే వ్యక్తిని ఒకే నెలలో 7 సార్లు కాటేసిన పాము
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

