Vijay Deverakonda: ప్రముఖ వాలీబాల్ టీమ్ “హైదరాబాద్ బ్లాక్ హాక్స్” కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి చిత్రాలలో విభిన్నమైన పాత్రల ద్వారాప్రేక్షకులకు దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఈ క్రేజీ హీరో బ్లాక్ హాక్స్ టీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవర కొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి చిత్రాలలో విభిన్నమైన పాత్రల ద్వారాప్రేక్షకులకు దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఈ క్రేజీ హీరో బ్లాక్ హాక్స్ టీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా బ్లాక్‌హాక్స్ యజమాని అభిషేక్ రెడ్డి కనకాల మాట్లాడుతూ ‘‘విజయ్ మాతో చేరడం సంతోషంగా ఉంది. ఆయన బ్రాండ్ అంబాసిడర్ , సహ యజమానిగా వ్యవహరించనున్నారు. ఆయన తనతో పాటు టీమ్‌కు నూతన విధానం తీసుకురావడం వల్ల మా బ్రాండ్‌ను నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లగలము. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల సంస్కృతి, స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహించాలనే మా లక్ష్య సాధన దిశగా అతి పెద్ద ముందడుగనూ వేశాము. రాబోయే వాటి గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ బ్లాక్ హాక్స్ మరో స్పోర్ట్స్ టీమ్ అనేది మాత్రమే కాదు అంతకు మించినది. ఇది తెలుగు ప్రజలందరికీ గర్వ కారణం. తెలుగు ప్రజల స్ఫూర్తి , శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మా బ్రాండ్ అలాగే మా టీమ్‌ను భారతదేశం మాత్రమే కాదు, ఇతర ప్రాంతాలకు సైతం తీసుకువెళ్లేందుకు చేయాల్సినంతగా నేను చేస్తాను’’ అని అన్నారు.
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ పవర్డ్ బై ఏ 23 అనేది ప్రైవేట్ యాజమాన్య నిర్వహణలోని ఇండియన్ ప్రొఫెషనల్ వాలీబాల్ లీగ్. హైదరాబాద్, అహ్మాదాబాద్, కోల్‌కతా, కాలికట్, కొచి, చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి ఎనిమిది టీమ్‌లు దీనిలో పోటీపడుతున్నాయి. ఈ లీగ్ తొలి సీజన్ అపూర్వ విజయం సాధించింది. ఇది ఒకే సమయంలో ఇంగ్లీష్ , హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషలలో ప్రసారమవుతుంది. ఈ మ్యాచ్‌లు మొత్తంమ్మీద 41 మిలియన్ టెలివిజన్ వ్యూయర్ షిప్ నమోదు చేయడంతో పాటుగా 43 మిలియన్ స్ట్రీమింగ్ వ్యూయర్‌షిప్ నమోదు చేసింది. అదనంగా, ఈ సీజన్ పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వ్యాప్తంగా 5 మిలియన్ ఫ్యాన్ ఎంగేజ్ మెంట్స్‌ను సొంతం చేసుకుంది.
ఈ లీగ్ రెండవ సీజన్‌లో 31 మ్యాచ్‌లు 04 ఫిబ్రవరి నుంచి 05 మార్చి వరకూ జరుగనున్నాయి. దీనిని భారతదేశంలో ప్రత్యేకంగా సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ తమ సోనీ స్పోర్ట్స్ 1, 3, 4లలో ప్రసారం చేయడంతో పాటుగా సోనీ లివ్‌పై స్ట్రీమింగ్ చేయనుంది.