Vijay Devarakonda: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే : విజయ్ దేవరకొండ

|

Dec 25, 2021 | 3:25 PM

ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. సినిమా టికెట్స్ ధర తగ్గించడంతో సినిమా పెద్దలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.

Vijay Devarakonda: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే : విజయ్ దేవరకొండ
Follow us on

Vijay Devarakonda: ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. సినిమా టికెట్స్ ధర తగ్గించడంతో సినిమా పెద్దలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల రేట్లు తగ్గించడంతో సినిమా నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని నిర్మాతలు అంటున్నారు. పలువురు హీరోలు కూడా ఏపీ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం సినిమా రేట్లు పెంచింది. దాంతో పలువురు సినీ పెద్దల, హీరోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా టికెట్ ధరల పెంపుపై హీరో విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నాడు విజయ్ దేవరకొండ.

రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది అన్నాడు విజయ్ దేవరకొండ. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసానిలు ఎంతో కృషి చేస్తున్నారు.. అలాగే  తెలంగాణ ప్రభుత్వం నూటికి నూటొక్క శాతం సినీ పరిశ్రమను పరిశ్రమగా మార్చాలని ఆలోచిస్తోంది అన్నారు విజయ్ దేవరకొండ. నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నాను.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ దేశంలోనే అతి పెద్ద పరిశ్రమ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. విజయ్ తో పటు మెగాస్టార్ చిరంజీవి కూడ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు చిరు. ” తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది.” అంటూ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: టికెట్స్ రేట్స్ పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ఏమన్నారంటే..

హీరోగా మారనున్న కాంగ్రెస్ కీలక నేత.. పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ ఎవరంటే…

Ghani: గని రిలీజ్ డేట్ వచ్చేసింది.. వరుణ్ తేజ్ సినిమా విడుదల ఎప్పుడంటే..