Varun Tej: వ‌రుణ్ తేజ్‌ ఫిడ్జెట్ స్పిన్న‌ర్‌ను భ‌లే తిప్పుతున్నాడే.. మీరూ ఇలా చేయ‌గ‌ల‌రేమో ఓసారి ట్రై చేయండి..

|

May 30, 2021 | 3:23 PM

Varun Tej: క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంలో దేశంలో మ‌ళ్లీ అన్నిప‌నులు స్థంభించి పోయాయి. ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తుండ‌డంతో అంతా ఇంటికే ప‌రిమితమ‌వుతున్నారు. ఇక నిత్యం సినిమాలు, షూటింగ్‌ల‌తో బిజీ బిజీగా..

Varun Tej: వ‌రుణ్ తేజ్‌ ఫిడ్జెట్ స్పిన్న‌ర్‌ను భ‌లే తిప్పుతున్నాడే.. మీరూ ఇలా చేయ‌గ‌ల‌రేమో ఓసారి ట్రై చేయండి..
Varun Tej Instagram
Follow us on

Varun Tej: క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంలో దేశంలో మ‌ళ్లీ అన్నిప‌నులు స్థంభించి పోయాయి. ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తుండ‌డంతో అంతా ఇంటికే ప‌రిమితమ‌వుతున్నారు. ఇక నిత్యం సినిమాలు, షూటింగ్‌ల‌తో బిజీ బిజీగా గ‌డిపే సినీతార‌లు ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. క‌రోనా కార‌ణంగా సినిమా నిర్మాణాలు వాయిదా ప‌డ‌డంతో కాల‌క్షేపం చేస్తున్నారు.
ఇందులో భాగంగా కొంద‌రు ఓటీటీలో సినిమాలు చూస్తుంటే.. మ‌రికొంద‌రు జిమ్‌ల‌కు వెళ్లి కండ‌లు పెంచుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మెగా హీరో వ‌రుణ్ తేజ్ ఫిడ్జెట్ స్పిన్న‌ర్‌తో టైమ్‌పాస్ చేశాడు. గిర్ర తిరుగుతోన్న స్పిన్న‌ర్‌ను ముక్కుపై బ్యాలెన్స్ చేస్తూ భ‌లే అనిపించాడు. ఈ వీడియోను తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు వ‌రుణ్‌. ప్ర‌స్తుతం ఈ వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. మ‌రి మీరు కూడా వ‌రుణ్‌లాగా స్పిన్న‌ర్‌ను బ్యాలెన్స్ చేయ‌గ‌ల‌రేమో ఓసారి ప్ర‌య‌త్నించి చూడండి.

వ‌రుణ్ తేజ్ పోస్ట్ చేసిన వీడియో..

ఇక వ‌రుణ్ సినిమాల విష‌యానికొస్తే.. చివ‌రిగా గ‌ద్ద‌ల కొండ గ‌ణేశ్ చిత్రంతో ఆక‌ట్టుకున్నాడు. హ‌రిష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది. వ‌రుణ్ ఇందులో నెగిటివ్ షేడ్స్‌లో ఉన్న పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్నాడు. ఇక ఈ యంగ్ హీరో ప్ర‌స్తుతం ఎఫ్ 2 సీక్వెల్‌గా తెర‌కెక్కుతోన్న‌ ఎఫ్ 3 చిత్రంతో పాటు.. గ‌ని అనే చిత్రంలోనూ న‌టిస్తున్నాడు. క‌రోనా కార‌ణంగా ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్‌ల‌ను వాయిదా వేసుకున్నాయి.

Also Read: GV Prakash: గంగిరెద్దును ఆడిస్తూ సన్నాయి వాయిస్తున్న వ్యక్తి.. వీడియో వైర‌ల్.. అత‌డికి సినిమా ఛాన్స్

Samsung Refrigerators: ఆదిరిపోయే ఆఫర్‌.. నెలకు రూ.890 కడితే చాలు ఫ్రిజ్‌ సొంతం చేసుకోవచ్చు..!

Khammam: ఖమ్మం జిల్లాలో 10 ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా.. కోవిడ్ వైద్య సేవల అనుమతులు రద్దు