టాలీవుడ్ హీరోలు వరుసగా గాాయాలకు గురవుతున్నారు. డూప్స్ లేకుండా ఫైట్స్, స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చకుంటున్నారు. మొన్న షూటింగ్ కోసం వెళ్తూ వరుణ్ తేజ్ కార్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. తాజాగా నౌగశౌర్య కూడా మూవీ చిత్రీకరణ సమయంలో కాలికి గాయం కావడంతో షూటింగ్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు యంగ్ హీరో సందీప్ కిషన్‌కు షూటింగ్ చేస్తుండగా గాయపడ్డాడు.
సందీప్ తాజాగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజంట్ ఈ చిత్ర షూటింగ్ కర్నూలులో జరుగుతోంది. ఈ సందర్భంగా జరిగిన బాంబ్ బ్లాస్ట్ సన్నివేశంలో సందీప్ గాయపడ్డారు. వెంటనే యూనిట్ సభ్యులు ఆయన్ను కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైట్ మాస్టర్ సమన్వయ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని మూవీ యూనిట్ తెలిపింది.
కాగా, శుక్రవారం సందీప్ కిషన్ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘తెనాలి రామకృష్ణ’ చిత్రీకరణలో భాగంగా బస్సులో నుంచి కిందపడే సన్నివేశానికి సంబంధించిన మేకింగ్ వీడియోను షేర్ చేశారు. క్యాలుక్లేటడ్ రిస్కు జీవితంలో బెస్ట్ థింగ్ అంటూ ఆ విడియోను ఫోస్ట్ చేశారు.
When calculated risk in the best thing about your job 🙂 #TenaliRamaKrishnaBaBL#NinuVeedaniNeedanuNene#CinemaForever #Action #keepingitReal pic.twitter.com/N4y6V2tYpF
— Sundeep Kishan (@sundeepkishan) June 14, 2019