Suman MAA Elections: ‘భారత్‌లో పుట్టిన వారంతా లోకల్‌’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్‌.. మా ఎన్నికలను ఉద్దేశించేనా?

|

Jul 02, 2021 | 11:00 AM

Suman MAA Elections: టాలీవుడ్‌ నటీనటుల సంఘం.. ‘మా’ అధ్యక్ష ఎన్నికల వ్యవహారం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఏ న్యూస్‌ ఛానల్‌ చూసిన ఈ ఎన్నికలకు సంబంధించిన వార్తలే వస్తున్నాయి. ఇక సాధారణ ఎన్నిలకు పోలిన రాజకీయం మా ఎన్నికల్లో జరుగుతోంది. ఇప్పటికే..

Suman MAA Elections: భారత్‌లో పుట్టిన వారంతా లోకల్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్‌.. మా ఎన్నికలను ఉద్దేశించేనా?
Suman About Maa Elections
Follow us on

Suman MAA Elections: టాలీవుడ్‌ నటీనటుల సంఘం.. ‘మా’ అధ్యక్ష ఎన్నికల వ్యవహారం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఏ న్యూస్‌ ఛానల్‌ చూసిన ఈ ఎన్నికలకు సంబంధించిన వార్తలే వస్తున్నాయి. ఇక సాధారణ ఎన్నిలకు పోలిన రాజకీయం మా ఎన్నికల్లో జరుగుతోంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, జీవిత రాజశేఖర్, మంచు విష్ణు, హేమతో పాటు సీవీఎల్ నర్సింహారావు కూడా ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో నిలిచారు. ఇంత మంది పోటీలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇక నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఈ ఎన్నికల్లో పాల్గొనడంతో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే వివాదానికి తెర లేసింది. తాను నాన్‌లోకల్‌ అయితే అవార్డులు ఎలా ఇచ్చారంటూ ప్రకాశ్‌రాజ్‌ ఓపెన్‌గానే స్పందించారు. ఇక ప్రకాశ్‌ రాజ్‌కు మద్ధతు నిలుస్తూ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టేట్‌మెంట్‌లు కూడా ఇస్తున్నారు.
తాజాగా నటుడు సుమన్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సుమన్‌ నేరుగా ప్రకాశ్‌ రాజ్‌కు మద్దతు తెలపకపోయినప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం అలానే అనిపిస్తున్నాయి. తాజాగా నేషనల్ డాక్టర్స్‌ డేలో భాగంగా బుధవారం ఓ కార్యక్రమంలోనే పాల్గొన్న సుమన్‌.. మా’ ఎన్నికల కారణంగా తెరపైకి వచ్చిన లోకల్‌ నాన్‌లోకల్‌ అంశంపై పరోక్షంగా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో పుట్టిన ప్రతిఒక్కరూ లోకల్‌ కిందే లెక్క.. కాబట్టి అందరూ కలిసి కట్టుగా ఉండాలి.. లోకల్‌-నాన్‌లోకల్‌ అనే వ్యవహారం గురించి ప్రస్తావించడం అర్థరహితం. ఒకవేళ వైద్యులు, రైతులు నాన్‌లోకల్ అనుకుంటే ప్రజలకు చికిత్స, ఆహారం అందదు’ అంటూ చెప్పుకొచ్చారు సుమన్‌.

Also Read: singer Sunitha : పూల మధ్య డ్రెస్ లో అలరిస్తున్న సింగర్ సునీత..!వైరల్ అవుతున్న ఫొటోస్..

Sampoornesh Babu: సంపూది వెన్నలాంటి హృదయం.. తల్లిదండ్రుల ఆత్మహత్యతో అనాథాలుగా మారిన చిన్నారులకు అన్నీ తానై..

Anasuya: లింగ సమానత్వంపై ఆరేళ్ల చిన్నారి ఆలోజింపజేసే ప్రశ్నలు.. తాను మద్ధతుగా నిలుస్తానంటోన్న అనసూయ.