AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా.. బిగ్ స్క్రీన్ మీద చూడదగ్గ మూవీ : సుధీర్ బాబు

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న కొత్త సినిమా జటాధర. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తెలుగు తెరకు పరిచయమవుతోంది. అలాగే గతంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శిల్పా శిరోద్కర్ చాలా ఏళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించనుంది. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా.. బిగ్ స్క్రీన్ మీద చూడదగ్గ మూవీ : సుధీర్ బాబు
Sudheer Babu
Rajeev Rayala
|

Updated on: Nov 06, 2025 | 9:34 AM

Share

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు అరోరా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

తండ్రి తోపు హీరో.. కూతురు మాత్రం మూడు సినిమాలకే కనిపించకుండా పోయింది.. ఆమె ఎవరంటే

జటాధర కథ ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు అన్న ప్రశ్నకు సుధీర్ బాబుసమాధానం ఇస్తూ.. చిన్నప్పుడు మనం జానపద, చందమామ కథలు వినుంటాం.’ బ్యాంకులో లేని సమయంలో ధనాన్ని భూమిలో పాతి ఒక బంధనం వేసి దానికి ఒక పిశాచి కాపలాగా ఉంటుంది’ అని ప్రచారంలో ఒక కథ ఉండేది. ఈ కథకు అలాంటి ఒక జానపదం ఆధారం. అలాంటి కథని ప్రజెంట్ టైంలోకి వచ్చి తీసుకొచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు అని చెప్పారు సుధీర్ బాబు.

నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు..!! బాబోయ్..ఒంటరిగా చూడకూడని సినిమా.. ఏకంగా మూడు ఓటీటీలో..

అలాగే సినిమాలో డిఫరెంట్ ప్లేయర్స్ ఉంటాయి. బాలీవుడ్ స్త్రీ సినిమా వచ్చింది. నిజానికి అది మన సౌత్ ఇండియాలో ‘ఓ స్త్రీ రేపు రా’ అన్న జానపదంలాంటి కథ. ఈ కథ విన్నప్పుడు కూడా నాకు ఇంట్రస్టింగ్ గా అనిపించింది. బిగ్ స్క్రీన్ మీద చూడదగ్గ కథ అనిపించింది. ఘోస్ట్ హంటింగ్, ఫ్యామిలీ ఎమోషన్, డివోషనల్, శివుడు గురించి కథలు. ఇలా చాలా లేయర్స్ వున్నాయి. అరుణాచల ప్రస్తావన కూడా వుంది. సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ కి కి మన పురాణాల్లో ఉన్న కొన్ని కథలు సొల్యూషన్ గా ఈ కథను చేయడం జరిగింది.ఈ సినిమా చేయడానికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నాకు చాలా ఎక్సైట్ చేసింది. యాక్షన్, ఫ్యామిలీ, మైథలాజి అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా ఇది అని చెప్పుకొచ్చారు సుధీర్ బాబు.. అలాగే సోనాక్షి చాలా అద్భుతమైన నటి. తన లుక్స్ సౌత్ ఇండియన్ లాగే ఉంటాయి. తన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ధనపిశాచి క్యారెక్టర్ కి చాలా వాల్యు యాడ్ చేశారు అని అన్నారు సుధీర్ బాబు.

Bigg Boss 9: అనుకున్నదే అయ్యింది. ఈసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతనే.?

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
శోభన్‌బాబు చనిపోయే ముందు ఆ హీరోయిన్‌కు చివరి ఫోన్ కాల్..
శోభన్‌బాబు చనిపోయే ముందు ఆ హీరోయిన్‌కు చివరి ఫోన్ కాల్..
మహిళల ఆరోగ్యం కోసం.. ఏటా చేయించుకోవాల్సిన 5 కీలక రక్త పరీక్షలివే
మహిళల ఆరోగ్యం కోసం.. ఏటా చేయించుకోవాల్సిన 5 కీలక రక్త పరీక్షలివే
వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు మృతి
వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు మృతి
ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మీకు ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే
మీకు ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే
'లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్‌'
'లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్‌'
శ్రీశైలం మల్లన్నకు విరాళంగా 540 గ్రాముల వెండి నాగాభరణం
శ్రీశైలం మల్లన్నకు విరాళంగా 540 గ్రాముల వెండి నాగాభరణం
మీరు కొనే చేపలు ఫ్రెష్‌గా ఉన్నాయో లేదా ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
మీరు కొనే చేపలు ఫ్రెష్‌గా ఉన్నాయో లేదా ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
ఏలినాటి శని సమయంలోనూ ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది
ఏలినాటి శని సమయంలోనూ ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది
అమ్మో.. ఈ వంటలు వండితే గ్యాస్ సిలిండర్ సగం ఖాళీ..
అమ్మో.. ఈ వంటలు వండితే గ్యాస్ సిలిండర్ సగం ఖాళీ..