హీరో సిద్దార్థ్‌కు బెదిరింపులు..! కుటుంబ సభ్యులను రేప్ చేసి చంపేస్తామని ఫోన్‌కాల్స్.. అసభ్య సందేశాలు..

Hero Siddharth : తమిళ నటుడు, హీరో సిద్ధార్థ్ ఈ పేరు అందరికి తెలిసే ఉంటుంది. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాలతో తెలుగు

హీరో సిద్దార్థ్‌కు బెదిరింపులు..! కుటుంబ సభ్యులను రేప్ చేసి చంపేస్తామని ఫోన్‌కాల్స్.. అసభ్య సందేశాలు..
Hero Siddharth Coments

Edited By: Team Veegam

Updated on: Apr 29, 2021 | 9:33 PM

Hero Siddharth : తమిళ నటుడు, హీరో సిద్ధార్థ్ ఈ పేరు అందరికి తెలిసే ఉంటుంది. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యాడు. కెరీర్ కాస్త వెనకబడినా ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటున్నాడు. అయితే ఇటీవల సిద్దార్థ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇటీవల కరోనా సమయంలో సిద్ధార్థ్ పలు సందర్భాల్లో తన వాయిస్ వినిపించి జనాన్ని చైతన్య పరిచేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలోనే మోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

తన ఫోన్ నంబర్ ను బీజేపీ తమిళనాడు ఐటీ సెల్ లీక్ చేసిందని ఆరోపిస్తున్నాడు. తనకు, తన కుటుంబానికి 24 గంటల్లో 500కు పైగా బెదిరింపు కాల్స్‌ వచ్చాయని అంటున్నాడు. కుటుంబ సభ్యులను అత్యాచారం చేసి చంపెస్తామని బెదిరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాడు. అన్ని నెంబర్లు రికార్డ్ చేసి పోలీసులకు ఇవ్వనున్నట్లుగా తెలిపాడు. అంతేకాదు తాను నోరు మూసుకుని కూర్చోనని, మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటానని నరేంద్ర మోదీ, అమిత్ షాను సైతం ట్యాగ్ చేశాడు. అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన అసమ్మతిని వ్యక్తం చేశాడు.

తనకు వచ్చిన బెదిరింపులకు సంబంధించి ఓ స్క్రీన్ షాట్‌ని చూపిస్తూ సిద్దార్థ్ ఇలా మాట్లాడాడు. ‘ కొవిడ్ నుంచి బయటపడగలం కానీ ఇలాంటి వాళ్లతో ఏం మాట్లాడగలం అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తమిళనాడు బీజేపీ సభ్యులే తనను టార్గెట్ చేశారని తన ఫోన్ నెంబర్ లీక్ చేసి, తనపై దాడికి కొంతమందిని ఉసి గొలుపుతున్నారని’ ఆరోపించారు. అయితే ప్రభుత్వాలు, వ్యవస్థలపై సిద్ధార్థ్ చేసిన విమర్శలు ఇప్పుడు జనాల్లో చర్చనీయాంశంగా మారాయి.

West Bengal Exit Poll Results 2021 LIVE: ఉత్త‌రాధిన పాగా వేసేది ఎవ‌రు..? బెంగాల్, అస్సాం ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్స్

Tamil Nadu Exit Poll Results 2021 LIVE: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ఎగ్జిట్‌ ఫోల్స్‌ ఫలితాలు

Exit Poll Result 2021 Kerala: నేటితో మినీ సంగ్రామానికి తెర.. వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్