Sharwanand Movie: అనిల్ రావిపూడి దర్శకత్వంలో శర్వానంద్ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి..

Sharwanand Movie Update: శర్వానంద్.. విభిన్న కథలను ఎంచుకుంటూ.. ప్రేమ, కుటుంబం, సున్నితమైన భావోద్వేగాలు.. యాక్షన్ కాన్సెప్ట్ తో సినిమాలు

Sharwanand Movie: అనిల్ రావిపూడి దర్శకత్వంలో శర్వానంద్ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి..
Sharwanand

Updated on: Jun 08, 2021 | 8:26 AM

Sharwanand Movie Update: శర్వానంద్.. విభిన్న కథలను ఎంచుకుంటూ.. ప్రేమ, కుటుంబం, సున్నితమైన భావోద్వేగాలు.. యాక్షన్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా.. నిధానంగా నచ్చిన సినిమాలను చేసుకుంటాడు శర్వానంద్. అలాగే ఫ్యామిలీ ప్రేక్షకులలో కూడా శర్వానంద్ కు మంచి క్రేజ్ ఉంది. అయితే శర్వానంద్ కు ప్రస్తుతం ఏ సినిమా కూడా మంచి హిట్ ఇవ్వలేకపోతుంది. ఇటీవల లాక్ డౌన్ అనంతరం ఎన్నో ఆశలతో వచ్చిన శ్రీకారం కూడా నిరాశపరిచింది. కానీ శర్వానంద్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. శర్వానంద్ కోసం పలువురు దర్శకులు కథలను సిద్ధం చేసుకుంటున్నారు. Anil Ravipudi

ప్రస్తుతం శర్వానంద్ మహా సముద్రం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అజయ్ భూపతి రాజా దర్శకత్వం వహిస్తుండగా.. హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా శర్వానంద్ తదుపరి సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు ఫేమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శర్వా ఓ మూవీ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే అనిల్ రావిపూడి శర్వానంద్ కు స్టోరీ వినిపించాడని.. ఆ ప్రాజెక్ట్ కు శర్వా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, శర్వానంద్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ రాలేదు.

Also Read: రోజూ ఈ పండ్లు, మూడు కూరగాయలు తింటే ఆయుష్షు పెరుగుతుందట.. హార్వర్డ్ అధ్యయనంలో షాకింగ్ నిజాలు..

Prashanth Neel: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‏గా ప్రశాంత్ నీల్.. మరో హీరోతో భారీ ప్రాజెక్ట్ ?

Sanjana Galrani : అన్నార్తులకు కొవిడ్ వేళ సినీనటి సంజన గల్రానీ ఆపన్నహస్తం.. దాదాపు నెల్లాళ్లుగా ఉచిత భోజన సేవ