AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bumper Offer 2 : 12 ఏళ్లతర్వాత సీక్వెల్ కి సిద్దమైన హీరో.. మరోసారి హిట్ కొడతాడా..?

Bumper Offer 2 movie : ఒక మూవీ విజయం సాధిస్తే దానికి సీక్వెల్ చేయటం కామనే. అదే చిత్రం పేరును కొనసాగిస్తూ కొత్త కథను తెరకెక్కించడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు

Bumper Offer 2 : 12 ఏళ్లతర్వాత సీక్వెల్ కి సిద్దమైన హీరో.. మరోసారి హిట్ కొడతాడా..?
Rajeev Rayala
| Edited By: Rajitha Chanti|

Updated on: Mar 06, 2021 | 3:02 PM

Share

Bumper Offer 2 movie : ఒక మూవీ విజయం సాధిస్తే దానికి సీక్వెల్ చేయటం కామనే. అదే చిత్రం పేరును కొనసాగిస్తూ కొత్త కథను తెరకెక్కించడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇలానేమరోసినిమాసీక్వెల్ గాప్రేక్షకులముందుకు రాబోతుంది. సాయిరాం శంకర్ హీరోగా గతంలో రూపొందిన ‘బంపర్ ఆఫర్’ చిత్రం, సాధించిన విజయం ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది. ఇప్పుడు ఆయనే హీరోగా అదే పేరును కొనసాగిస్తూ ‘బంపర్ ఆఫర్ – 2’ పేరుతో ఓ చిత్రం నిర్మితం కానుంది. వివరాల్లోకి వెళితే…..

తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రముఖ స్థానాన్ని ఏర్పరుచుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ గారి ఆశీర్వాదం తో, సురేష్ విజయ ప్రొడక్షన్స్ మరియు సినిమాస్ దుకాన్ సంయుక్త నిర్మాణంలో సాయిరాం శంకర్ హీరోగా సురేష్ యల్లంరాజు, సాయి రామ్ శంకర్ లు నిర్మాతలుగా ‘బంపర్ ఆఫర్ 2’ చిత్రాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ‘బంపర్ ఆఫర్’ విజయం నేపథ్యంలో పన్నెండు సంవత్సరాల తర్వాత అదే పేరు మీద రెండవ భాగం చేస్తున్నారు. అయితే ఇది సీక్వెల్ కాదు, రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నారు. ‘బంపర్ ఆఫర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన జయ రవీంద్ర ఈ రెండో భాగాని కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి అశోక స్క్రిప్ట్ రచన చేశారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ఉగాది శుభాకాంక్షలతో ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతుంది. చిత్రం లోని హీరోయిన్స్ మరియు ఇతర తారాగణం,సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సురేష్ యల్లంరాజు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akaash Vani Movie Teaser : దర్శకధీరుడు వదిలిన ఆకాశవాణి.. ఆకట్టుకుంటున్న టీజర్..