Sai Dharam Tej: అదొక స్వీట్ మెమోరీ.. కానీ నన్ను ట్రోల్ చేశారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మెగా మేనల్లుడు

|

Apr 02, 2023 | 6:34 PM

చిత్రలహరి సినిమా తర్వాత మరో హిట్ అందుకోలేదు తేజ్. రిపబ్లిక్ మూవీ సమయంలో రోడ్డు ప్రమాదం జరగడంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు తేజ్.

Sai Dharam Tej: అదొక స్వీట్ మెమోరీ.. కానీ నన్ను ట్రోల్ చేశారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మెగా మేనల్లుడు
Sai Dharam Tej
Follow us on

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విరూపాక్ష అనే ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చిత్రలహరి సినిమా తర్వాత మరో హిట్ అందుకోలేదు తేజ్. రిపబ్లిక్ మూవీ సమయంలో రోడ్డు ప్రమాదం జరగడంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు విరూపాక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు తేజ్. టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ అంచనాలు పెరిగాయి. కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ్‌కు జోడిగా సంయుక్త మీనన్‌ నటిస్తోంది. బ్లాక్‌ మ్యాజిక్‌ వంటి ఇంట్రెస్టింగ్‌ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తేజ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలాగే తనకు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి కూడా స్పందించాడు తేజ్. సాయి ధరమ్ తేజ్ గత ఏడాది రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

ఈ ప్రమాదంలో తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. కొంతకాలం తర్వాత కోలుకున్న తేజ్. ఇప్పుడు విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ రోడ్డు ప్రమాదం గురించి స్పందిస్తూ.. ప్రమాదం జరిగి నేను బెడ్ పై ఉంటే నా కోసం చాలా మంది ప్రార్ధనలు చేశారు అన్నాడు తేజ్. అలాగే కొంతమంది నన్ను ట్రోల్ చేశారు కూడా.. ఆ ట్రోల్ కి తానేమి బాధపడటం లేదని అన్నారు. ప్రమాదం ఎప్పుడు కూడా పీడకల కాదని అదొక స్వీట్ మెమోరీ చెప్పుకొచ్చాడు తేజ్.