సాధారణంగా ఓ పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ తర్వాత.. నెక్ట్స్ కూడా అదే రేంజ్ సినిమాతో వస్తుంటారు హీరోలు. కానీ నిఖిల్ మాత్రం భిన్నమైన దారిలో వస్తున్నారు. 100 కోట్ల సినిమా తర్వాత.. 18 పేజెస్ లాంటి సెన్సిబుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో నిఖిల్ సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుందా..? ఆయన మార్కెట్‌ను 18 పేజెస్ ఎంతవరకు బ్యాలెన్స్ చేయనుందన్నది ఆసక్తికరంగా మారింది. కొన్నిసార్లు తమ స్థాయికి మించిన విజయాలు హీరోలను ఇబ్బంది పెడుతుంటాయి. ఒకేసారి మార్కెట్ పెరిగిపోయేసరికి.. నెక్ట్స్ ఏం చేయాలి.. ఎలాంటి సినిమా చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. నిఖిల్ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉందిప్పుడు. కార్తికేయ 2తో ఏకంగా 100 కోట్ల విజయాన్ని అందుకున్నారీయన. పైగా పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది.. దాంతో ఆ ప్రెజర్ 18 పేజెస్ సినిమాపై పడుతుంది.
కుమారి 21 ఎఫ్ తర్వాత సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే రాసి.. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో వస్తున్న సినిమా 18 పేజెస్. కార్తికేయ 2 ముందు వరకు ఇది కామన్ నిఖిల్ సినిమానే కానీ.. దాని బ్లాక్‌బస్టర్ తర్వాత 18 పేజెస్‌పై అంచనాలు పెరిగాయి. పైగా నిఖిల్, అనుమప పరమేశ్వరన్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో.. ఆసక్తి పెరిగిపోయింది. డిసెంబర్ 23న విడుదల కానున్న ఈ చిత్ర సెన్సార్ పూర్తైంది. దీనికి U/A సర్టిఫికేట్ వచ్చింది.
డిసెంబర్ 19న 18 పేజెస్ ప్రీ రిలీజ్ వేడుక జెర్సీ కన్వెన్షన్ హాల్‌లో జరగబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారు. గీతా ఆర్ట్స్ 2 నిర్మాణంతో పాటు సుకుమార్ రైటింగ్స్ భాగం కావడంతో బన్నీ చీఫ్ గెస్టుగా వస్తున్నారు. డిసెంబర్ 23న రవితేజ ధమాకా విడుదల కానుంది. ఆ రోజే 18 పేజెస్ కూడా రాబోతుంది. మరి చూడాలిక.. నిఖిల్ ఏం చేయబోతున్నారో..?
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..