నేచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగి సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు అష్ట చమ్మ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాని ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే నాని తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో నాని నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆతర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే దసరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. ఇక ఇప్పుడు హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. తన మొదటి లవ్ స్టోరీ గురించి తెలిపాడు. హాయ్ నాన్న మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని రేడియో జాకీలతో చిట్ చాట్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.