Tuck Jagadish : నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉంది. నానికి నిన్ను కోరి వంటి మంచి హిట్ ఇచ్చిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో తెలుగమ్మాయి రీతువర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ సినిమాపై చాలా రోజుల నుంచి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను ఓటీటీలో రిలీజీ చేయనున్నారని ఆమధ్య టాక్ గట్టిగా వినిపించింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని మేకర్స్ చెప్పుకుంటూ వచ్చారు. కరోనా కల్లోలం తర్వాత ఇటీవలే థియేటర్లు రీఓపెన్ అయ్యాయి. ఇప్పటికే చిన్న సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. త్వరలోనే పెద్ద సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్‌కు ముహుర్తాలు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే నాని టక్ జగదీష్ టీమ్ ఓ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది.
టక్ జగదీష్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలవుతుందని ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలకు బలం చేకూరేలా హీరో నాని మూవీ రిలీజ్ విషయంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. “ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య చూడడానికి ఇష్ట్ట పడే వ్యక్తిని నేను, అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా టక్ జగదీష్ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్న వారికి నేను సపోర్ట్ చేస్తాను. ఇలాంటి చిత్రమైన పరిస్థితి నాకిది రెండోవ సారి…” అంటూ రాసుకొచ్చారు నాని. ఇక నాని నటించిన వి సినిమా కూడా ఓటీటీలోనే విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. థియేటర్స్‌లో విడుదలై ఉంటే మినిమమ్ గ్యారెంటీ అయినా ఉండేదన్న టాక్ కూడా వినిపించింది. ఇక ఇప్పుడు టక్ జగదీష్ సినిమాకూడా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడంతో అభిమానుల్లో చిన్నపాటి ఆందోళన మొదలైంది. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :