Akkineni Nagarjuna: మాట నిలబెట్టుకున్న హీరో అక్కినేని నాగార్జున.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున..

|

Feb 17, 2022 | 1:27 PM

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల ప్రకటించినట్లుగానే

Akkineni Nagarjuna: మాట నిలబెట్టుకున్న హీరో అక్కినేని నాగార్జున.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున..
Nagarjuna 1
Follow us on

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల ప్రకటించినట్లుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ శివారులోని చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్కుగా ఏర్పాటు చేయనున్నారు. ఈరోజు ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్‏తో కలిసి చెంగిచర్లలోని శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున, అమల, కుమారులు నాగ చైతన్య, నిఖిల్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అటవీ పార్కు అభివృద్దికి ముఖ్యమంత్రి సంకల్పించిన హరిత నిధి (గ్రీన్ ఫండ్) ద్వారా రెండు కోట్ల రూపాయల చెక్ కు అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందించారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. మన పరిసరాలు, రాష్ట్రం, దేశం కూడా ఆకుపచ్చగా, పర్యావరణ హితంగా మారాలన్న సంకల్పంతో, తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఎం.పీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని పలు సార్లు మొక్కలు నాటానని తెలిపారు. గతంలో బిగ్ బాస్ సీజన్ ఫైనల్ కార్యక్రమం సందర్భంగా అడవి దత్తతపై సంతోష్ గారితో చర్చించానని, ఆ రోజు వేదికపై ప్రకటించినట్లు గానే ఇప్పుడు అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉందని అన్నారు. ఈ అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణ ప్రాంత కాలనీ వాసులకు పార్కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

33

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా అడవి దత్తతకు నాగార్జున ముందకు రావటాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రశంసించారు. చెంగిచర్ల ఫారెస్ట్ బ్లాక్ లో దివంగత అక్కినేని నాగేశ్వర రావు పేరుపై అర్బన్ పార్కు అభివృద్దితో పాటు, ఖాళీ ప్రదేశాల్లో దశల వారీగా లక్ష మొక్కలను నాటే కార్యక్రమాన్ని నేటి నుంచే ప్రారంభించి ఎంపీ వెల్లడించారు. దేశంలో ఏ పెద్ద నగరానికి లేని ప్రకృతి సౌలభ్యత ఒక్క హైదరాబాద్ కే ఉందని, రాజధాని చుట్టూ ఉన్న లక్షా యాభై వేల ఎకరాలకు పైగా అటవీ భూమిని పరిరక్షించటం, పునరుద్దరణ చేయటం, అర్బన్ పార్కుల ఏర్పాటుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తమ వంతు ప్రయత్నం చేస్తుందని సంతోష్ అన్నారు. దీనికోసం సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

Nagarjuna 44

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ స్పెషల్ సెక్రటరీ ఏ. శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, పీసీసీఎఫ్ (ఎస్.ఎఫ్) ఆర్.ఏం. డోబ్రియల్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఏం.జె. అక్బర్, మేడ్చల్ జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ డీఎఫ్ఓ జోజి, డీఎఫ్ఓ అశోక్, అక్కినేని నాగార్జున ఇతర కుటుంబ సభ్యులు సుప్రియ యార్లగడ్డ, సురేంద్ర యార్లగడ్డ, సుమంత్ కుమార్, సుశాంత్, నాగ సుశీల, లక్ష్మీ సాహిత్య, సరోజ, వెంకట నారాయణ రావు, జ్యోత్స్న, అనుపమ, అదిత్య, సంగీత, సాగరిక, తదితరులు పాల్గొన్నారు.

Nagarjuna

హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్- మేడిపల్లి ప్రాంతంలో చెంగిచెర్ల ఫారెస్ట్ బ్లాక్ ఉంది. చుట్టూ విపరీతంగా జరిగిన పట్టణీకరణ మధ్య ఈ 1682 ఎకరాల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో నాగార్జున వేయి ఎకరాలను దత్తత తీసుకున్నారు. నగర వాసులకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేలా కొద్ది ప్రాంతంలో అర్బన్ పార్కును అభివృద్ది చేసి, మిగతా ప్రాంతంలో అటవీ పునరుద్దరణ పనులు చేయనున్నారు. మేడిపల్లి నుంచి చెంగిచర్ల, చర్లపల్లి, ఈసీఐఎల్ ప్రాంతాలు, కాలనీ వాసులకు ఈ పార్కు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

Also Read: Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..

Horoscope Today: వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ.. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..

Mirnalini Ravi: ఎర్ర చీరలో వయ్యారాలు వలకబోస్తున్న ‘మృణాళిని రవి’ లేటెస్ట్ ఫొటోస్…