Hero Movie Pre Release Event : ‘హీరో’గా ఎంట్రీ ఇవ్వనున్న మహేష్ మేనల్లుడు.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా మెగా హీరో.

టాలీవుడ్ లో కొత్తహీరోలు తమ జోరు చూపిస్తున్నారు. విభిన్న మైన కథలను ఎంచుకొని మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Hero Movie Pre Release Event : హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న మహేష్ మేనల్లుడు.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా మెగా హీరో.

Updated on: Jan 16, 2022 | 6:36 PM

Hero Movie Pre Release Event: టాలీవుడ్ లో కొత్తహీరోలు తమ జోరు చూపిస్తున్నారు. విభిన్న మైన కథలను ఎంచుకొని మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ కు ఇప్పుడు మరో హీరో పరిచయం కానున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ కుర్ర హీరో పరిచయం అవుతున్నాడు. హీరో అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అశోక్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో నేడు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ముగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కానున్నారు. అమర రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్పై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. చిన్న తనం నుంచే హీరో కావాలనుకునే కుర్రాడు అనుకోకుండా ఓ మర్డర్ కేసు లో చిక్కుకోవడం దాన్ని నుంచి అతడు ఎలా బయట పడ్డాడు అనేది ప్రధానాంశం గా ఉండనుందని తెలుస్తుంది. హీరో మూవీ ప్రీరిలీజ్ లై ఇక్కడ చూడండి.


మరిన్ని ఇక్కడ చదవండి : 

Raviteja: రామారావుతో కాలు కదపనున్న బాలీవుడ్ శృంగార తార.. సాంగ్ అద్భుతంగా వచ్చిందంటోన్న దర్శక నిర్మాతలు..

Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే..

Mohan Babu: గుడ్‏న్యూస్ చెప్పిన మోహన్ బాబు.. శ్రీ విద్యానికేతన్ కాలేజ్‏కీ యూనివర్సిటీ హోదా..